ఆదివారం 07 మార్చి 2021
Vikarabad - Jan 06, 2021 , 00:11:37

అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌ నేతలు ఓర్వలేక పోతున్నారు

 అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌ నేతలు ఓర్వలేక పోతున్నారు

 పరిగి, జనవరి 5: పరిగి అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌ నాయకులు ఓర్వలేక పోతున్నారని మున్సిపల్‌ చైర్మ న్‌ ముకుంద అశోక్‌, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు రవీంద్ర, కృష్ణ, వెంకటేశ్‌, నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. మంగళవారం పరిగిలోని మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో వారు మాట్లాడుతూ పరిగిని అన్ని రంగా ల్లో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌ రెడ్డి విశేష కృషి చేస్తున్నారన్నారు. మంత్రి కేటీఆర్‌ను ఎమ్మెల్యే స్వయంగా కలిసి పరిగి మున్సిపల్‌ అభివృ ద్ధికి రూ.15కోట్లు మంజూరు చేయించారన్నారు. కాంగ్రెస్‌ కౌన్సిలర్లు గల వార్డుల్లో సుమారు రూ.3 కోట్ల విలువ చేసే పనులు చేపట్టామన్నారు. తాను ఒక గ్రాడ్యుయేట్‌నని, తనను డమ్మీ చైర్మన్‌ అంటూ ఓ కాంగ్రెస్‌ నేత పేర్కొనడం తగదన్నారు. కాంగ్రెస్‌ నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలని హె చ్చరించారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ నాయకులు కుయుక్తులకు పాల్పడుతున్నారన్నారు. ఇష్టానుసారంగా నిధులు రికార్డు చేయించారని వా రు చేసిన ఆరోపణలు సత్యదూరమని తెలిపారు. ఎమ్మెల్యే అన్ని వర్గాల ప్రజా ప్రతినిధులకు గౌరవం ఇస్తారని, ఈ విషయం అందరికీ తెలుసునన్నారు. ఏమీ తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడిన ఓ కాంగ్రెస్‌ నేత ఆర్టీసీ కండక్టర్‌గా ఏ ఒక్కరోజు డ్యూటీ చేయకుండా, తెల్లబట్టలు వేసుకుని తిరిగారని విమ ర్శించారు. తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయ కుంటే పరువు నష్టం దావా వేస్తానని మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిల ర్లు కిరణ్‌, బద్రుద్దీన్‌, అర్చన, కో-ఆప్షన్‌ సభ్యులు ముజమిల్‌, శేఖర్‌, నాయకులు ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి, రవికుమార్‌, మౌలానా, రమేశ్‌  పాల్గొన్నారు. 


VIDEOS

logo