మంగళవారం 09 మార్చి 2021
Vikarabad - Jan 04, 2021 , 01:21:54

క్రీడలతో మానసికోల్లాసం

క్రీడలతో మానసికోల్లాసం

  • ఎమ్మెల్యే ఆనంద్‌
  • వికారాబాద్‌లో కరాటే పోటీలు ప్రారంభం
  • పాల్గొన్న ఎంపీ రంజిత్‌రెడ్డి

వికారాబాద్‌ : క్రీడలు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయని ఎమ్మెల్యే ఆనంద్‌ పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్‌లోని రత్నారెడ్డి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన కరాటే పోటీలను ఎంపీ రంజిత్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రతిఒక్కరూ కరాటేను నేర్చుకోవాలన్నారు. దీంతో ఆత్మ రక్షణ భావాన్ని పెంపొందిస్తుందన్నారు. క్రీడల వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉంటారన్నారు. కరాటే శిక్షణ తీసుకున్న వారికి ఇది ఒక ఉపాధి మార్గంగా మారుతుందని చెప్పారు. ఉద్యోగాలలో సైతం ప్రత్యేక కేటాయింపులు ఉంటాయన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ అనంత్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌లు ముత్యంరెడ్డి, రాంచంద్రారెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్‌ హఫీజ్‌, నాయకులు గిరీశ్‌ కొఠారి, సుభాన్‌రెడ్డి, షఫీ, మల్లికార్జున్‌ పాల్గొన్నారు. 

ఆలంపూర్‌కు పాదయాత్ర ప్రారంభం 

వికారాబాద్‌లోని శివరాంనగర్‌కాలనీకి చెందిన మాలే లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో దాసాంజనేయ యువజన సంఘం సభ్యులు కరోనా మహమ్మారి అంతమవ్వాలని అలంపూర్‌కు పాదయాత్ర నిర్వహించగా, ఎమ్మెల్యే ఆనంద్‌ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో పట్టణ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

సావిత్రిబాయి ఫూలే చేసిన కృషి అమోఘం 

సావిత్రిబాయి ఫూలే సమాజానికి చేసిన సేవ అమోఘమని ఎమ్మెల్యే ఆనంద్‌ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని శివరాంనగర్‌ కాలనీలో సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలవేసి జయంతోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి భారతీయ మహిళ ఉపాధ్యాయురాలిగా ఎదిగిన గొప్ప మహిళ అని కొనియాడారు. సమాజంలో స్త్రీలు విద్య లేక సామాజిక రుగ్మతలతో వంటింటికి పరిమితమవుతున్నారని, ఇది మారాలని జ్యోతిరావు ఫూలే సంకల్పించారు. దీంతో మొదటి చదువు నేర్పాల్సింది తన భార్యకు అని గుర్తించి, సావిత్రిబాయికి ఇంట్లోననే విద్య నేర్పాడు. ఇలా సావిత్రిబాయి ఇంట్లో నేర్చుకున్న విద్యను బయటి మహిళలకు నేర్పిందని తెలిపారు. 

VIDEOS

logo