అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి

- పైప్‌లైన్, డ్రైనేజీ పనులు చేపట్టిన తర్వాతే రోడ్డు విస్తరణ
- ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, కలెక్టర్ పౌసుమిబసు
- పరిగిలో చేపడుతున్న రోడ్డు వెడల్పు పనులు పరిశీలన
పరిగి : రోడ్డు వెడల్పు పనులు సజావుగా చేపట్టాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, కలెక్టర్ పౌసుమిబసు సూచించారు. పరిగిలో సుమారు రూ.10కోట్లు వెచ్చించి చేపడుతున్న రోడ్డు వెడల్పు పనులు, తుంకులగడ్డ రోడ్డు నిర్మాణ పనులు శనివారం ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, కలెక్టర్ పౌసుమిబసు పరిశీలించారు. ఈ సందర్భంగా గంజ్‌రోడ్డులో చేపడుతున్న రోడ్డు వెడల్పు పనులు మన్నికగా, ముందుగా సూచించినట్లుగానే చేపట్టాలన్నారు. రోడ్డు పనులు పూర్తి కాకముందే మంచినీటి పైప్లైన్లు సరిచూసుకోవాలని, ఇరువైపులా మురికికాలువల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. కాలువల నిర్మాణం తర్వా తే రోడ్డు వెడల్పు పనులు చేపట్టడం వల్ల రోడ్డు పది కాలాలపాటు మన్నికగా ఉంటుందని వారు పేర్కొన్నారు. గంజ్‌రోడ్డులో ఓపెన్ డ్రెయిన్ నిర్మాణం చేపట్టి, స్లాబ్ వేయాలన్నారు. గంజ్‌రోడ్డులో ఉన్నటువంటి చిరు వ్యాపారుల డబ్బాల ఏర్పాటుకు ప్రత్యామ్నాయ స్థలం చూపిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. తద్వారా పనులు నిరాటంకంగా కొనసాగేందుకు చిరు వ్యాపారులు సహకరించాలన్నారు. రోడ్డు వెడల్పు పనులు పూర్తయి తే గంజ్‌రోడ్డు మరింత విశాలంగా, సుందరంగా మారుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు
మురికినీటి కాలువల నీరు వాగులో కలువకుండా ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఒక్కో ప్లాంటు ఏర్పాటుకు అర ఎకరం స్థలం అవసరమవుతుందని, రూ.35లక్షలతో ట్రీట్మెంట్ ప్లాంటు ఏర్పా టు చేయవచ్చన్నారు. రెండు ప్రధాన కాలువలు ఉన్నచోట వా టి ఏర్పాటుకు స్థలం కేటాయించాల్సిందిగా కలెక్టర్ సూచించారు. ట్రీట్మెంట్ ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని పరిశీలిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. తద్వారా ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే మురికినీటిని శుద్ధి చేస్తుందన్నారు. పరిగిలోని 7, 8, 9 వార్డుల పరిధిలోని ఇండ్ల నుంచి వచ్చే మురికినీరు వెళ్లడానికి తుంకులగడ్డ రోడ్డుకు ఇరువైపులా మురికికాలువలు నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరా రు. పనులు త్వరగా చేపట్టాల్సిందిగా కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి ‘మహా’ నమూనాలు
- ఇండో-పాక్ సంబంధాల్లో కీలక పరిణామం.. మళ్లీ చర్చలు షురూ!
- రెచ్చిపోయిన పృథ్వీ షా.. మెరుపు డబుల్ సెంచరీ
- కఠిక పేదరికాన్ని నిర్మూలించాం.. ప్రకటించిన చైనా అధ్యక్షుడు
- కళ్లు దుకాణాల్లో సీసీ కెమెరాలు
- షాకింగ్ : పక్కదారి పట్టిందనే ఆగ్రహంతో భార్యను హత్య చేసి..
- క్రికెట్లో ఈయన రికార్డులు ఇప్పటికీ పదిలం..
- పవన్ కళ్యాణ్‌తో జతకట్టిన యాదాద్రి చీఫ్ ఆర్కిటెక్ట్
- వీడియో : గంటలో 172 వంటకాలు
- ఫలక్‌నుమాలో భారీగా లభించిన పేలుడు పదార్థాలు