చదువుతో పాటు క్రీడలూ ముఖ్యం

- అదనపు కలెక్టర్ మోతీలాల్
మర్పల్లి : చదువుతోపాటు క్రీడలు ఎంతో ముఖ్యమని ప్రతి ఒక్క రూ క్రీడల్లో పాల్గొనాలని వికారాబాద్ అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన ఫ్రెండ్స్ యూత్ క్రికెట్ టోర్నమెంట్ శనివారం చివరిరోజు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సమాజంలో అందరూ బాగుండాలని, అం దులో నేనుండాలనుకోవాలని అన్నారు. యువకులు చెడు అలవాట్లకు పాల్పడకుండా ముందు తరాలకు ఆదర్శంగా నిలువాలన్నా రు. ఆటలే మనోవికాసానికి బాటలని, ఆటల వల్ల మానసిక ఉల్లాసం, ఆరోగ్యంగా ఉండి చదువుకుంటే మంచి చదువు అబ్బుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నుంచి క్రీడాకారులు జిల్లా, రాష్ట్రస్థాయిలో ఆటల్లో పాల్గొని తమ గ్రామానికి, మండలానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం క్రికెట్ టోర్నమెంట్లో విన్నర్ కోహిర్ మండలం మాచిరెడ్డిపల్లి జట్టుకు రూ.10వేలు, ట్రోపీ, రన్నర్ నాగిరెడ్డిపల్లికి చెందిన జట్టుకు రూ.5వేలు ట్రోపీని అందజేశారు. అలాగే మాజీ డీసీసీబీ డైరెక్టర్ ప్రభాకర్‌గుప్తా విన్నర్ జట్టుకు రూ.5వేలు, రన్నర్ జట్టుకు రూ.3వేలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అలితా రమేశ్, తాసిల్దార్ తులసీరామ్, ఎస్ఐ సతీశ్, ఆర్ఐ కారుణాకర్, మాజీ డీసీసీబీ డైరెక్టర్ ప్రభాకర్‌గుప్తా, నాయకులు బట్టు రమేశ్, రవీందర్, మల్లేశ్‌యాదవ్, సలీం, ఫ్రెండ్స్ యూత్ ఆర్గనైజర్స్ ఉన్నారు.
తాజావార్తలు
- ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 9న తొలి మ్యాచ్
- ఐటీ సోదాలు.. బయటపడిన వెయ్యి కోట్ల అక్రమాస్తులు!
- సోనియా అధ్యక్షతన కాంగ్రెస్ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం
- వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించండి : మంత్రి కేటీఆర్
- తమిళనాడు, కేరళలో అమిత్‌షా పర్యటన
- కాసేపట్లో మోదీ ర్యాలీ.. స్టేజ్‌పై మిథున్ చక్రవర్తి
- న్యూయార్క్‌లో రెస్టారెంట్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా
- ఆరు రాష్ట్రాల్లోనే 84.71 శాతం కొత్త కేసులు: కేంద్రం
- ఫాస్టాగ్ కొంటున్నారా.. నకిలీలు ఉన్నాయి జాగ్రత్త!
- చారిత్రాత్మకం ముజీబుర్ రహ్మాన్ ప్రసంగం.. చరిత్రలో ఈరోజు