శుక్రవారం 05 మార్చి 2021
Vikarabad - Jan 03, 2021 , 00:19:52

వివాహిత అదృశ్యం

వివాహిత అదృశ్యం

తాండూరు రూరల్‌ : వివాహిత అదృశ్యమైన సంఘటన కరణ్‌కోట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం జరిగింది. ఎస్సై ఏడుకొండలు కథనం ప్రకారం.. తాండూరు మండలం కరణ్‌కోట గ్రామానికి చెందిన అంబమ్మ(28) నాలుగు రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె మతిస్థిమితం సరిగ్గాలేదని భర్త ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో కూడా ఇలా వెళ్లి, మళ్లీ ఇంటికి తిరిగి వచ్చేదని తెలిపారు. ఈసారి నాలుగు రోజులైనా ఇంటికి రాకపోవడంతో చుట్టాలు, స్నేహితుల వద్ద ఆమె ఆచూకీ కోసం వెతికారు. ఫలితం లేకపోవడంతో భర్త తిరుమల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


VIDEOS

logo