శనివారం 06 మార్చి 2021
Vikarabad - Jan 02, 2021 , 00:09:35

ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి

ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి

  • ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ 

వికారాబాద్‌: ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గోధుమగూడ గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రజలు, గ్రామం అభివృద్ధి చెందాలన్నారు. అందరూ సుభీక్షంగా ఉండాలనే ఆకాంక్షతో గ్రామ నడిబొడ్డులో బొడ్రాయి ప్రతిష్ఠిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీని వల్ల గ్రామానికి, ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన కలుగాలంటే, మనస్సుకు నచ్చిన దేవుడిని పూజించాలని, అప్పుడే అన్ని మంచి జరుగుతాయని అన్నారు. ఆ దేవుడి కరుణ అందరిపై ఉండాలని ఆయన కోరుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అనిత, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు విజయ్‌కుమార్‌, రాములు, పీఎసీఎస్‌ చైర్మన్లు సత్యనారాయణరెడ్డి, ముత్యంరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కమాల్‌రెడ్డి, ధారూరు మండల పార్టీ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు వెంకటయ్య, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, జనరల్‌ సెక్రటరీ సత్తయ్యగౌడ్‌, ఉప సర్పంచ్‌లు నర్సింహులు, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్‌ అనంత్‌రెడ్డి, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ చిగుళ్లపల్లి రమేశ్‌కుమార్‌, మాజీ జడ్పటీసీ ముత్తహార్‌ షరీఫ్‌, ఏఎంసీ డైరెక్టర్‌ శివకుమార్‌, నాయకులు యాదయ్య, సంతోష్‌, నర్సింహ్మారెడ్డి, ఉపేందర్‌ పాల్గొన్నారు. 


VIDEOS

logo