సోమవారం 01 మార్చి 2021
Vikarabad - Jan 02, 2021 , 00:09:26

లక్ష్యం @ 3.20 లక్షలు

లక్ష్యం @ 3.20 లక్షలు

  • 32 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు
  • ప్రతి నర్సరీలో 10వేలు మొక్కల పెంపకానికి ప్రణాళిక
  • మొక్కలు నాటేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధం 

ధారూరు, జనవరి 1: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, పచ్చదనాన్ని పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి ఏటా గ్రామాల వారీగా లక్ష్యాలను విధిస్తున్నది. ప్రతి సంవత్సరం మాదిరిగానే వచ్చే ఏడాది కోసం ఈ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ధారూరు మండల పరిధిలోని 32 గ్రామ పంచాయతీల్లో 3.20లక్షల  మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నారు. మొత్తం 32 గ్రామ నర్సరీలను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మండల అభివృద్ధి విస్తరణాధికారులను బాధ్యత తీసుకుని మొక్కలను పెంచుతున్నారు. మొక్కలు పెంచేందుకు గ్రామ నర్సరీల్లో మట్టిని ప్లాస్టిక్‌ కవర్లల్లో ఉపాధి హామీ కూలీలు నింపుతున్నారు. 

ప్రతి నర్సరీకి పదివేలు.. 

ధారూరు మండల పరిధిలోని 32 గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 10వేలు మొక్కలు చొప్పున 3.20 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ధారూరు మండల పరిధిలోని అల్లాపూర్‌ గ్రామ నర్సరీలో 10వేలు మొక్కలకు సరిపడు ప్లాస్టిక్‌ కవర్లులను సిద్ధం చేశారు. అల్లీపూర్‌ గ్రామ నర్సరీలో 10వేలు మొక్కలు, అంపల్లి నర్సరీలో 10వేలు, అంతారం గ్రామ నర్సరీలోనూ 10వేలు, చింతకుంట నర్సరీలో 10వేలు, ధర్మపూర్‌ నర్సరీలోనూ 7.5వేల మొక్కలు, ధారూరు నర్సరీలో 9వేలు మొక్కలు, స్టేషన్‌ ధారూరు గ్రామ నర్సరీలో 10 వేలు, దోర్నాల్‌  నర్సరీలో 10వేలు, ఎబ్బనూర్‌ నర్సరీలో 10వేలు, గడ్డమీది గంగారం నర్సరీలో 4.6వేలు, గట్టేపల్లి గ్రామ నర్సరీలో 4.5 వేలు, గురుదోట్ల నర్సరీలో 8.5 వేలు, హరిదాస్‌పల్లి నర్సరీలో 7వేలు, కెరెళ్లి నర్సరీలో 10వేలు, కొండాపూర్‌కలాన్‌ నర్సరీలో 10వేలు, కుక్కింద నర్సరీలో 9వేలు, కుమ్మరిపల్లి నర్సరీలో 7వేలు మొక్కలు, మోమిన్‌కలాన్‌ నర్సరీలో 10వేలు మొక్కలు, మోమిన్‌ఖుర్ధు నర్సరీలో 10వేలు, మున్నూర్‌సోమారం నర్సరీలో 7వేలు మొక్కలు, మైలారం నర్సరీలో 6.5వేలు మొక్కలు, నాగారం నర్సరీలో 10వేలు మొక్కలు, నాగసముందర్‌ నర్సరీలో 7.4వేలు మొక్కలు, నాగుసాన్‌పల్లి నర్సరీలో 10వేలు మొక్కలు, నర్సాపూర్‌ నర్సరీలో 10వేలు మొక్కలు, అవుసుపల్లి నర్సరీలో 10వేలు మొక్కలు, పులిచింతల మడుగు తండా నర్సరీలో 10వేలు మొక్కలు, రాజాపూర్‌  నర్సరీలో 10వేలు, రాంపూర్‌తండా నర్సరీలో 9వేలు మొక్కలు, రుద్రారం నర్సరీలో 7వేలు, తరిగోపుల నర్సరీలో 10వేలు మండల పరిధిలోని 32 గ్రామ నర్సరీల్లో మొత్తం 2.84లక్షలు మొక్కలు పెంచేందుకు ఏర్పాట్లు చేశారు. మిగతావి వారం/పది రోజుల్లో లక్ష్యం మేరకు పూర్తి చేయనున్నారు.

రైతుల కోసం మొక్కలు సిద్ధం చేస్తాం 

అన్ని గ్రామ నర్సరీల్లో రైతులకు అందుబాటులో అన్ని రకాల మొక్కలను సిద్ధం చేసి ఉంచుతాం.  పండ్లు, పూల మొక్కలు, తదితర వాటిని సిద్ధం చేస్తున్నాం. ధారూరు మండల పరిధిలోని 32 గ్రామ నర్సరీల్లో మొక్కలు పెంచి, ఉపాధి హామీ కూలీల ద్వారా నాటేందుకు ఏర్పాట్లు చేశాం. లక్ష్యం మేరకు అన్ని గ్రామాల్లో నర్సరీల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

- సురేశ్‌కుమార్‌, ఏపీవో ధారూరు మండలం 


VIDEOS

logo