శనివారం 27 ఫిబ్రవరి 2021
Vikarabad - Jan 02, 2021 , 00:09:07

మర్డర్‌ కేసును ఛేదించిన పోలీసులు

మర్డర్‌ కేసును ఛేదించిన పోలీసులు

వికారాబాద్‌ : మండలంలోని పులుమద్ది గ్రామానికి చెందిన బేగరి శివప్రసాద్‌ గత నెల 7న తప్పిపోగా, తండ్రి ఫిర్యాదుతో పోలీసులు ధర్యాపు చేశారు. అదే నెల 31న సంగారెడ్డి జిల్లా పిచరాగడి వద్ద ఉన్న జాజు బావిలో శవమై తేలాడు. ఈ కేసును పోలీసులు విచారించి ఛేదించారు. దీనికి సంబంధించి సీఐ రాజశేఖర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పులుమద్ది గ్రామానికి చెందిన బేగరి మచ్చేందర్‌, లక్ష్మమ్మలకు నలుగురు కుమారులు,  శివప్రసాద్‌(17) చిన్నవాడు కాగా, జల్సాలకు అలవాటు పడి ఇంట్లో నిత్యం డబ్బులు కావాలంటూ, పెండ్లి చేయాలని ఇబ్బందులకు గురి చేస్తుండేవాడు. ఈ బాధలను భరించలేక తల్లి విసుగెత్తి విషయాన్ని సంగారెడ్డి జిల్లా దిగ్వాల్‌లో ఉండే తన తల్లి పుష్యమ్మ, తమ్ముడు భూపాల్‌కు చెప్పింది. దీంతో వారు బంధువులు ఉన్న కోహీర్‌ మండలం, బిలాల్‌పూర్‌ గ్రామానికి చెందిన అనంతరాములుకు చెప్పి చంపేందుకు పథకం రచించారు. ఇందుకు లక్ష రూపాయల సుపారి మాట్లాడుకున్నారు. ఈ పథకంలో భాగంగా అనంతరాములు తనతో పాటు బక్కయ్య, శ్రీశైలంతో కలిసి మృతుడు శివప్రసాద్‌ను పిచారాగడి తండా వద్ద ఉన్న జాజు బావి వద్ద మద్యం తాగించారు. అనంతరం టవాల్‌(రుమాలు)తో గొంతు నులిమి చంపి, మృతదేహాన్ని బావిలో పడేశారు. మృతుడి తండ్రి సమాచారంతో పోలీసులు క్లూస్‌ టీమ్‌తో కేసును ఛేదించారు.  నిందితులను శుక్రవారం పోలీసులు రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.

VIDEOS

logo