శనివారం 06 మార్చి 2021
Vikarabad - Dec 31, 2020 , 00:06:47

గిరిజన బెస్టు అవైలబుల్‌ పాఠశాల

గిరిజన బెస్టు అవైలబుల్‌ పాఠశాల

  •  ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానం 

వికారాబాద్‌ : 2020-21 సంవత్సరానికి గాను బెస్టు అవైలబుల్‌ పాఠశాలలో 3,5,8వ తరగతుల ప్రవేశం కోసం గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన శాఖ అధికారి కోటాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 17 ఖాళీలు ఉన్నాయని, 3వ తరగతికి 9, 5వ తరగతికి 5, 8వ తరతగతికి 3 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. విద్యార్థులు వికారాబాద్‌ జిల్లాకు చెందినవారై ఉండాలని, అభ్యర్థి యొక్క తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షల లోగా, పట్టణ ప్రాంతాల వారికి రూ.2లక్షలు లోగా ఉండాలన్నారు. ఒక కుటుంబం నుంచి ఒక్క విద్యార్థికి మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. దరఖాస్తులు ఈ నెల 31 నుంచి జనవరి 8వ తేదీ వరకు జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయంలో లభిస్తాయని తెలిపారు. పూర్తిచేసిన దరఖాస్తులను కూడా అదే కార్యాలయంలో అందజేయాలని, లేదా పోస్టు ద్వారా కూడా జనవరి 8వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా పంపించాలని పేర్కొన్నారు. లాటరీ విధానం ద్వారా విద్యార్థుల ఎంపిక ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు కులం, ఆదాయం, ఆధార్‌కార్డు, జనన ధ్రువీకరణ, ప్రస్తుతం చదువుతున్న పాఠశాల బోనఫైడ్‌, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో తప్పనిసరిగా ఉండాలని సూచించారు.

VIDEOS

logo