శుక్రవారం 05 మార్చి 2021
Vikarabad - Dec 30, 2020 , 03:20:09

టీఆర్‌ఎస్‌ పార్టీలో వర్గవిభేదాలు లేవు

టీఆర్‌ఎస్‌ పార్టీలో వర్గవిభేదాలు లేవు

  • తాండూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విఠల్‌నాయక్‌, టీఆర్‌ఎస్‌నాయకులు

 తాండూరు రూరల్‌: టీఆర్‌ఎస్‌ పార్టీలో వర్గ విభేధాలు లేవని, కౌన్సిలర్లంతా ఏకతాటిపై ఉన్నారని, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తాండూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విఠల్‌నాయక్‌, పార్టీ  నాయకులు మురళీకృష్ణగౌడ్‌ అన్నారు. మంగళవారం తాండూ రు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో వారు మాట్లాడుతూ పార్టీలో వర్గ విభేదాలు న్నాయని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిల మ ధ్య ఏదో జరిగిందని మీడియాలో వచ్చిన కథనాలను ఖండిస్తున్నామన్నారు.మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఎమ్మెల్యే,ఎమ్మె ల్సీల మధ్య ఏ చర్చ జరుగలేదని స్పష్టం చేశారు. కౌన్సిలర్లంతా సమిష్టిగానే ఉన్నారని అన్నారు. కౌన్సిల్‌ సమావేశం ఈనెల 23 జరగాల్సి ఉండగా,అనివార్య కారణల వల్ల సమావేశం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు.అయితే 28వ తేదీన మరో సారి సమావేశం ఏర్పాటు చేయడం ఎజెండాపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. మొదటి ఎజెండాలోని అంశాలు కాకుండా,రెండో ఎజెండాలోని అంశాలను ఆమోదిస్తూ ప్రకటించడం సమంజసం కాదన్నారు. మున్సిపల్‌ పాత,కొత్త చట్ట ప్రకా రం మున్సిపల్‌ కమిషనర్‌ సంతకం పెట్టి రూపొందించిన ఎజెం డా చెల్లుబాటు అవుతుందన్నారు. 23న ఏర్పాటు చేసిన ఎజెం డాలో కమిషనర్‌ సంతకం ఉందని, 28న జరిగిన కౌన్సిల్‌ సమావేశంలోని ఎజెండాపై కమిషనర్‌ సంతకం లేదని కమిషనర్‌ సం తకం ఉన్నదే చెల్లుబాటవుతుందని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో రెండు ఎజెండాలను ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, కమిషనర్‌కు చూయించారని గుర్తు చేశారు. రెండో ఎజెండా ఎలా వచ్చిందో నాకు తెలియదని కమిషనర్‌ అన్నాడని వారు తెలిపారు. తప్పు డు ఎజెండాను తయారుచేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీ సుకోవాలి డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో తాండూరు ప్రగతికి టీఆర్‌ఎస్‌ నేతలు, ప్రజాప్రతినిధులు కట్టుబడి ఉన్నారన్నారు. సమావేశంలో నయీం, నర్సింహులు, మా ర్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, ఇర్ఫాన్‌ పాల్గొన్నారు.  


VIDEOS

తాజావార్తలు


logo