నాణ్యతలో రాజీ వద్దు

- పనులు పక్కాగా చేపట్టాలి
- పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి
- రోడ్ల విస్తరణ, నిర్మాణ పనుల పై సమీక్ష
పరిగి: పరిగి పట్టణంలో రోడ్ల విస్తరణ పనులు పక్కాగా చేపట్టాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఆదేశించారు. రూ.10 కోట్లతో చేపడుతున్న పనులపై మంగళ వారం మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు ముందు నుంచి తాసిల్దార్ కార్యాలయం, తాసిల్దార్ కార్యాలయం నుంచి మహాత్మాగాంధీ విగ్రహం మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు రోడ్డు వెడల్పు పనులు సక్రమంగా చేపట్టాలన్నారు. రోడ్లను పూర్తిస్థాయిలో మన్నికగా ఉండేలా నిర్మాణం చేపట్టాలని, ముందుగా డ్రైనేజీ, మంచినీటి పైప్‌లైన్ నిర్మాణం పూర్తయిన తర్వాతే రోడ్ల నిర్మాణం చేపట్టాల్సిందిగా ఎమ్మెల్యే ఆదేశించారు. మంచినీటి పైప్‌లైన్ ఏర్పాటుకు నిధులను మున్సిపాలిటీ నుంచి కేటాయించాల్సిందిగా సూచించారు. గతం లో సూచించినట్లుగానే పూర్తిస్థాయిలో రోడ్డు వెడల్పు చేపట్టాలని, ఎక్కడా తక్కువ కాకుండా చూడాలన్నారు. మధ్యలో డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసేలా విస్తరణ పనులు ఉండాల్సిందిగా ఎమ్మెల్యే చెప్పారు. విస్తరణ పనులకు దుకాణాల యజమానులు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. మిగతా రూ.5 కోట్ల పనులకు సంబంధించిన అంచనాలు వెంటనే తయారు చేయాలని ఆదేశించారు. పరిగి నుంచి ఎర్రగడ్డపల్లి వరకు బీటీ రోడ్డు రెన్యువల్‌తోపాటు వెడల్పు కోసం అంచ నాలు తయారు చేయాల్సిందిగా ఏఈకి సూచించారు. రోడ్డు వెడల్పు తగ్గించే విధంగా చూడరాదని, పూర్తిస్థాయిలో చేపడితే పది కాలాలపాటు మన్నికగా ఉంటుందని అన్నారు. మార్చి తర్వాత మరో రూ.15కోట్లు పరిగికి మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అంతలోపు ప్రస్తుతం ఉన్నటువంటి రూ. 15 కోట్ల విలువ చేసే పనులు పూర్తి చేయాల్సిందిగా సూచించారు. వెంటనే 10 శాతం కంట్రిబ్యూషన్ డబ్బులు చెల్లించి, రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ లైన్లు మార్పు చేసే పనులు జరిగేలా చూడాలన్నారు. ప్రతీ వారం ఈ పనుల పురోగతిని సమీక్షించాల్సిందిగా మున్సిపల్ చైర్మన్‌కు ఎమ్మెల్యే సూచించారు. రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే పట్టణం మరింత సుందరంగా మారుతుందని అన్నారు. అనంతరం రోడ్డు వెడల్పు పనులను స్వయంగా ఎమ్మెల్యే పరిశీలించి తగు సూచనలు, సలహాలు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మాజీ ఎంపీపీ కె.శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎ.సురేందర్‌కు మార్, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, కౌన్సిలర్లు వేముల కిరణ్, ఎదిరె కృష్ణ, వారాల రవీంద్ర, బద్రుద్దీన్, నాగేశ్వర్రావు, వెంకటేశ్, టీఆర్ఎస్ నాయ కులు బి. రవికుమార్, తాహెర్‌అలీ పాల్గొన్నారు.
తాజావార్తలు
- నిర్మల్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
- హాట్ టాపిక్‌గా వైష్ణవ్‌తేజ్ 3 సినిమాల రెమ్యునరేషన్
- బస్సులను అపడం లేదు.. కానీ నెగటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి
- రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న రైల్వే పోలీసులు ..వీడియో
- అతివేగం ఖరీదు : బెంజ్ కారు నడుపుతూ వ్యక్తిని బలిగొన్న టీనేజర్!
- నీరవ్ కోసం ఆర్థర్ జైలులో ఏర్పాట్లు
- భారత్‌తో చర్చలకు సిద్ధం : ఇమ్రాన్ ఖాన్
- సీటెట్ ఫలితాల విడుదల
- అందాల యాంకరమ్మకు అంతా ఫిదా..!
- మృతదేహానికీ ఉరిశిక్ష అమలు.. ఇరాన్లో ఇచ్ఛంత్రం..!