ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Vikarabad - Dec 29, 2020 , 03:12:45

కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి

 కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి

  • జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన తాండూరు ఎమ్మెల్యే, కౌన్సిలర్లు 

వికారాబాద్‌ : తాండూరు మున్సిపల్‌ కార్యాలయంలో రెండుసార్లు సమావేశాలను రద్దు చేసినందుకుగాను కమిషనర్‌పై తగు చర్యలు తీసుకోవాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, కౌన్సిలర్లు సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి కమిషనర్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ రోజు తాండూరు మున్సిపల్‌ కార్యాలయంలో కౌన్సిలర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎజెండాపై ఎలాంటి చర్చ జరుగకుండానే రెండు నిమిషాల్లోనే ఎజెండాను అమోదించినట్లు చెప్పి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ సమావేశం ముగించారని తెలిపారు. 

వాస్తవానికి ఈ నెల 23న మున్సిపల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ రోజు ఎలాంటి కారణాలు లేకుండానే సమావేశాన్ని రద్దు చేసినట్లు ప్రకటించారు. ఆ తర్వాత డిసెంబర్‌ 28న సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కౌన్సిలర్లకు ఈ నెల 26న రాత్రి 10 గంటలకు ఎజెండాలను అందించారు. ఈ ఎజెండాకు మున్సిపల్‌ కమిషనర్‌ నుంచి ఎలాంటి అమోదం లేదని స్వయంగా కమిషనర్‌ వెల్లడించారు. కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం ఒకసారి సిద్ధమైన ఎజెండాలో అంశాలను మార్చడానికి, తొలగించడానికి చైర్‌పర్సన్‌తో పాటు ఎవరికీ అధికారం ఉండదని ఫిర్యాదు తెలిపారు. అయినా కూడాడిసెంబర్‌ 23న జరుగాల్సిన సమావేశానికి తయారుచేసిన ఎజెండా అంశాలను తొలగించి కొత్త అంశాలను తయారుచేశారు. ఏకపక్ష నిర్ణయాలతో సమావేశాలను సాటి కౌన్సిలర్లకు సమాచారం లేకుండా, అడ్డగోలుగా అంశాలను తయారు చేయడం, నచ్చకపోతే తీసివేయడం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. ఈ ఫిర్యాదు పత్రాలను మున్సిపల్‌ శాఖ మంత్రికి, పురపాలక డైరెక్టర్‌కు, జిల్లా ఇన్‌చార్జి మంత్రికి పంపించామని తెలిపారు. 

VIDEOS

logo