మంగళవారం 02 మార్చి 2021
Vikarabad - Dec 29, 2020 , 03:12:47

రోడ్డు నిర్మాణానికి సహకరించండి

రోడ్డు నిర్మాణానికి సహకరించండి

పరిగి మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌ 

 పరిగి: పరిగి పట్టణంలోని గంజ్‌రోడ్డు వెడల్పు, విస్తరణ పనులకు అందరూ సహకరించాలని మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అ శోక్‌ కోరారు. సోమవారం ఆయన వ్యాపారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. రూ.కోటి 44లక్షలతో మహాత్మాగాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు రోడ్డు వెడల్పుతో పాటు సీసీ, బీటీ రోడ్డు నిర్మాణం చేపడుతామని రోడ్డు మధ్యలో డివైడర్‌, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. తద్వారా గంజ్‌రోడ్డు పూర్తిగా విశాలంగా మారడంతోపాటు సుందరంగా మారనుందని రోడ్డు వెడల్పు పనులు త్వరగా పూర్తయ్యేందుకు అంద రూ సహకరించాలన్నారు. నిబంధనల మేరకు రోడ్డు వెడల్పు చేపడుతామని, రోడ్డు పక్కన డబ్బాల వారికి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మార్గదర్శనంలో ప్రత్యేకంగా స్థలం చూయిస్తామన్నారు. సాధ్యమైనంత త్వరగా పనులు చేపట్టడానికి అవసరమైన చర్య లు తీసుకుంటామని తెలిపారు. కాగా రోడ్డు వెడల్పు పనులకు తమ సహకారం ఉంటుందని వ్యాపారులు పేర్కొన్నారు. అంతకుముందు గంజ్‌రోడ్డు వెడల్పు పనులను ఆయన స్వయంగా పరిశీలించి పనులు వేగంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ ఎదిరె క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo