సోమవారం 01 మార్చి 2021
Vikarabad - Dec 28, 2020 , 05:27:45

అడవులపై ప్రత్యేక నిఘా

అడవులపై ప్రత్యేక నిఘా

  • చెట్లు నరికితే కేసులు నమోదు
  • జంతువుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

కొందుర్గు:  తెలంగాణ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరు వాత వృక్షాలను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. అలాగే  రాష్ట్రంలో కోట్ల సంఖ్యలో మొక్కలు పెంచే కార్య క్రమాన్ని నిర్వహిస్తున్నది. అడవుల నుంచి ఒక్క చెట్టు కూడా నరకడానికి వీలులేదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మొక్కలు నాటడం,  అడవులను కాపాడడం వల్ల రాబోవు రోజుల్లో మానవ మనుగడకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూ డదని ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగానే అడవులను పూర్తి స్థాయిలో సంరక్షించుకోవాలని అదనపు అటవీశాఖ సిబ్బందిని ఏర్పాటు చేసింది. అడవులపై అధికా రుల ప్రత్యేక నిఘా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. 

షాద్‌నగర్‌ నియోజకర్గం జిల్లెడ్‌చౌదరిగూడ మండలంలోని పెద్ద ఎల్కిచర్ల గ్రామ శివారులో గల అడవి  అతి పెద్దది . సర్వే నెంబర్‌ 867, 867/7లలో 665 ఎకరాల్లో విస్తరించి ఉంది.  రంగారెడ్డి జిల్లా జిల్లెడ్‌చౌదరిగూడ మండలంలోని పెద్ద ఎల్కిచర్ల, గాలిగూడ, వీరాపురం, సాకలిపల్లి తండా, వికారా బాద్‌ జిల్లా కుల్కచర్ల మండలంలోని లింగంపల్లి తండా, ముజాహిద్‌పూర్‌ గ్రామాలు సరిహద్దులుగా వున్నాయి. ఈ అడవి సంరక్షణ కోసం ఒక బీట్‌ అఫీసర్‌, నలుగురు వాచర్‌లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అడ విలో జంతువుల కోసం నీటి వసతి కల్పించినట్లు వారు తెలి పారు. సరిహద్దులు ఏర్పాటు చేసి ఇతరులు అడవిని ఆక్ర మించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సరిహ ద్దులు గుర్తించి కాలువలు తీశారు.  అడవిని ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని  అధికారులు తెలిపారు. 

హరితహారం ద్వారా పెద్ద ఎల్కిచర్ల అడవిలో మొక్కలు నాటు తున్నారు. గత ఏడాది దాదాపు 16వేల మొక్కలు నాటారు. ప్రస్తుతం పెద్ద ఎల్కిచర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ఫారెస్టు నర్సరీలో  లక్షల మొక్కలు పెంచుతున్నారు. అడవిలో  చెట్లు నరకడానికి ప్రయత్నిస్తే కేసులు నమోదు చేసేం దుకు ప్రభు త్వం ఆదేశాలు జారీ చేసింది. అడవిలో ఎక్కువ శాతం చెనంగీ, టేకు, మద్ది, కానుగ, నీలగిరి, వేప చెట్లు ఉన్నాయి.


VIDEOS

logo