బుధవారం 03 మార్చి 2021
Vikarabad - Dec 28, 2020 , 05:08:12

రాష్ట్ర పథకాలు దేశానికే ఆదర్శం

రాష్ట్ర పథకాలు దేశానికే ఆదర్శం

రాష్ట్ర పథకాలు దేశానికే ఆదర్శమని తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి అన్నారు.  బషీరాబాద్‌ తాసిల్దార్‌ కార్యాలయం ఆవరణలో ఆదివారం రూ. 87,10,0 92  విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లల పెండ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఆర్థిక సాయం అందిస్తున్నదన్నారు.   రైతుబంధు, రైతుబీమా పథకాలు అన్నదాతల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు.  అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు.  కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. 

బషీరాబాద్‌: కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పేదలకు ఇబ్బంది కలుగకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంక్షేమ పథకాలు అమలుచేయడం గొప్ప విషయమని తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి అన్నారు. ఆదివారం తాసిల్దార్‌ కార్యాలయంలో 87 మంది లబ్ధిదారులకు రూ.87లక్షల 10వేల 092ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర పథకాలు దేశానికే ఆదర్శమని, మిషన్‌ భగీరథ రాష్ర్టానికి మంచి పేరు తెచ్చిందని అన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు అన్నదాతల కుటుంబాల్లో కొత్త వెలుగులు తీసుకొచ్చాయన్నారు. యాసంగి పంటసాగు ఖర్చుల నిమిత్తం ఇచ్చే రైతుబంధు డబ్బులు అర్హులైన ప్రతి రైతు ఖాతాలో ప్రభుత్వం నేటి నుంచి జమ చేస్తున్నదని ఆయన స్పష్టం చేశారు. 

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు ఆడపిల్లల తల్లిదండ్రులకు గుండె ధైర్యాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో కూడా పథకాలను కొనసాగించడం చూస్తుంటే పేదల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంత అంకిత భావం ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కరుణ అజయ్‌ప్రసాద్‌, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌ ప్రియాంక, ఎంపీటీసీ రేఖ, శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ అజయ్‌ప్రసాద్‌, నాయకులు నర్సిరెడ్డి, రాము నాయక్‌, రజాక్‌, శ్రవణ్‌, నరేశ్‌ పాల్గొన్నారు.

సీఎం ఆర్‌ఎఫ్‌తో పేదలకు భరోసా

తాండూరు రూరల్‌: సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేదల ఆరోగ్యానికి ఎంతో భరోసాగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూరులోని మున్సిపల్‌ క్వార్టర్స్‌కు చెందిన శివశంకర్‌కు రూ.3 లక్షల ఎల్‌వోసీని అందజేశారు. మెరుగైన వైద్యం కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 

VIDEOS

logo