శుక్రవారం 05 మార్చి 2021
Vikarabad - Dec 26, 2020 , 05:08:37

ఏసు స్మరణలో... ఆలపించిన కీర్తనలు

ఏసు స్మరణలో... ఆలపించిన కీర్తనలు

వికారాబాద్‌ : ఈ లోకంలో పాపులను రక్షించుట కోసం లోకరక్షకుడైన ఏసుక్రీస్తు ప్రభు వు బెత్లాహేములోని పశువుల పాకలో జన్మించారని డీఎస్‌ రెవరెండ్‌ మార్కు క్రైస్తవ భక్తులకు బోధించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సెంట్‌ మేరీ మేథడిస్టు సెంట్రల్‌ చర్చీలో క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకుని ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.  

బొంరాస్‌పేట : మెట్లకుంట, రేగడిమైలారం, బొంరాస్‌పేట, తంకిమెట్ల గ్రామాలలోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మెట్లకుంట గ్రామంలో సాయంత్రం జరిగిన ఆటల పోటీలలో క్రైస్తవ సోదరులు, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు బతుకమ్మ ఆటలు ఆడారు.  ఆటల్లో పాల్గొన్నవారికి బహుమతులు అందించారు.

మర్పల్లి : మండలంలోని వివిధ గ్రామాలలో క్రిస్మస్‌ పండుగ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు.    

దౌల్తాబాద్‌ : చంద్రకల్‌, పోల్కంపల్లి, గోఖఫస్లవాద్‌, దౌల్తాబాద్‌ , దేవర్‌ఫస్లవాద్‌, బిచ్చల్‌, సుల్తాన్‌పూర్‌, తిమ్మారెడ్డిపల్లి, గుండేపల్లి, బాలంపేట, ఇముడాపూర్‌, అల్లపూర్‌, సుల్తాన్‌పూర్‌, తదితర గ్రామాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి దేవున్ని స్మరించుకున్నారు.  

కొడంగల్‌ : మండల పరిధిలోని పలు చర్చిలలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఏసుక్రీస్తును స్తుతిస్తూ ఆలపించిన కీర్తనలతో చర్చీ ప్రాంగణాలు మార్మోగాయి. 

VIDEOS

logo