పండుగలకు సర్కార్ కానుకలు

పరిగి : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ వర్గాలకు చెందిన పండుగలను సర్కారు నేతృత్వంలోనే జరిపిస్తూ, పేదలకు ఉచితంగా దుస్తుల పంపిణీ చేయడంతోపాటు విందులు ఇస్తున్నది. పేదల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడంతోపాటు పకడ్బందీగా అమలు చేస్తున్నది. ప్రతి నియోజకవర్గానికి ఒక జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి దుస్తుల పంపిణీ సక్రమంగా జరిగేలా చూస్తున్నది. రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ సంబురాలు, సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఘనంగా జరుపడం విశేషం.
దుస్తుల పంపిణీ
రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా ముస్లింలు, క్రిస్టియన్లకు దుస్తుల పంపిణీ చేపడుతున్నది. ప్రతిసారి జిల్లాలో 16,000 ప్రత్యేక కానుకలు రంజాన్ సందర్భంగా పంపిణీ చేపట్టడం జరిగింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందులు కూడా ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25వ తేదీన క్రిస్టియన్లు క్రిస్మస్ పండుగను నిర్వహించుకుంటారు. డిసెంబర్ రెండవ వారంలోనే ప్రత్యేకంగా క్రిస్టియన్ మత పెద్దలతో సమావేశాలు జరిపి పేదలను ఎంపిక చేసి ప్రతి నియోజకవర్గంలోనూ వెయ్యి కుటుంబాలకు దుస్తుల పంపిణీ చేపట్టారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా విందు ఏర్పాటు చేసేవారు. ఈసారి కోవిడ్ కారణంగా విందు ఇవ్వడం లేదు.
బతుకమ్మచీరలు అందజేత
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన బతుకమ్మ పండుగను ప్రభుత్వం ఘనంగా జరుపుతూ వస్తున్నది. 2014 నుంచి ప్రభుత్వం బతుకమ్మ పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నది. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడచులకు ప్రత్యేకంగా చీరలు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి తెల్లరేషన్కార్డులో పేరున్న 18 సంవత్సరాలు పైబడిన వారికి చీరలు పంపిణీ చేపడుతున్నది. ఈసారి జిల్లాలో సుమారు 3లక్షల మంది మహిళలకు బతుకమ్మ చీరలు అందజేసింది. 287 డిజైన్లలో ప్రత్యేకంగా చేనేత కార్మికులతో నేయించి బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది. గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలు సైతం ప్రభుత్వమే ఘనంగా నిర్వహించడం గమనార్హం.
తాజావార్తలు
- హాట్ ఫొటోలతో హీటెక్కిస్తున్న పూనమ్ బజ్వా
- కన్యాకుమారి లోక్సభ.. బీజేపీ అభ్యర్థి ఖరారు
- మహేష్ బాబు కొత్త కార్వ్యాన్ ఇదే..!
- ఆ ఐదు రాష్ట్రాల్లోనే అత్యధికంగా కొత్త కేసులు
- మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
- కరోనా టీకా తీసుకున్న కేంద్ర మంత్రులు
- పూజా హెగ్డే లేటెస్ట్ పిక్స్ వైరల్
- షాకింగ్.. బాలుడిపై లైంగికదాడి
- 22 మిలియన్ క్యూబిక్ మీటర్ల రాళ్లు కూలడం వల్లే..
- రాజస్థాన్లో పాక్ చొరబాటుదారుడు హతం