శుక్రవారం 05 మార్చి 2021
Vikarabad - Dec 24, 2020 , 23:24:49

జనవరిలో వారియర్స్‌కు వ్యాక్సిన్‌

జనవరిలో వారియర్స్‌కు వ్యాక్సిన్‌

వికారాబాద్‌ : జనవరిలో కరోనా వ్యాక్సిన్‌ అందించేందుకు సంబంధిత శాఖల అధికారులకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసు అదేశించారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో కాన్ఫరెన్స్‌ హాలులో కరోనా వ్యాక్సినేషన్‌ జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన సంబంధిత శాఖల అధికారులతో వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరిలో వ్యాక్సినేషన్‌ చేసేందుకు వైద్య సిబ్బందితోపాటు ఐసీడీఎస్‌ సిబ్బందికి టీకాలు అందించాలని సూచించారు. వ్యాక్సినేషన్‌ చేయడానికి కనీసం మూడు గదులు ఉండేటట్లు చూడాలన్నారు. వెయిటింగ్‌ రూం, వ్యాక్సినేషన్‌ రూం, అబ్జర్వేషన్‌లకు ప్రత్యేక గదులు ఉండాలని తెలిపారు. గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల సహకారం తీసుకోవాలని డీపీవోకు సూచించారు. వచ్చే వ్యాక్సిన్‌ కిట్లకు భద్రపరిచేందుకు స్థానిక డెంటల్‌ కళాశాల, మహవీర్‌ దవాఖానతోపాటు అనంతగిరి దవాఖానను పరిశీలించి ఏర్పాట్లు చేయాలన్నారు. వ్యాక్సినేషన్‌ స్టోరేజీ సెంటర్ల వద్ద 24 గంటలు విద్యుత్‌ సరఫరా అయ్యేటట్లు విద్యుత్‌ శాఖ అధికారికి సూచించారు. టీకాలు వేసేందుకు ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేసి పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. అవసరమైన వలంటీర్లతోపాటు మాస్కులు, సానిటైజర్లు అందుబాటులో ఉంచుకోవాలని వైద్యాధికారులకు కలెక్టర్‌ సూచించారు. ఈ సందర్భంగా డా.అరవింద్‌ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై పవర్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కమిటీకి వివరించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుధాకర్‌షిండే, డా.లలిత, అరవింద్‌, డీఆర్‌డీవో క్రిష్ణన్‌, ఎస్‌ఈ ట్రాన్స్‌కో జానకీరాం, డీపీవో రిజ్వానా, డీఈవో రేణుకాదేవి, డీఎస్‌సీడీవో విజయలక్ష్మి, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 


VIDEOS

logo