గణితంపై పట్టు అవకాశాలకు మెట్టు

కొడంగల్: గణితం అంటే అంచనా వేయడం, తార్కికంగా ఆలోచించడం, సంఖ్యల మధ్య సంబంధం ఏర్పాటు చేయడం, సమస్యలను వేగంగా కచ్ఛితంగా సాధించడం. గణిత భావనలను అర్థం చేసుకోవడం, ఇచ్చిన అంశాల ఆధారంగా సూత్రీకరణ, నిర్ధారణకు రావడం, అన్వయించడం, గణిత పరమైన వాతావరణం కల్పించడం గణితానికి అర్థం. డిసెంబర్ 22న గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని గణితశాస్త్ర దినోత్సవాన్ని జరుపుకొంటాం. 1887 డిసెంబర్ 22వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని ఈ రోడ్ పట్టణంలో జన్మించారు. చిన్న వయస్సు నుంచి గణితంపై ఆయనకు మక్కువ ఉండేది. దాంతో గణితానికి సులువైన పద్ధతులు కనుక్కోవాలనుకున్నారు. ఆ దిశగా చిన్న నాటి నుంచి గణితంలో పరిశోధన ప్రారంభించారు. రామానుజం గణిత పరిజ్ఞానాన్ని చూసి ఎంతో మంది ఆశ్యర్యానికి గురయ్యారు. అటువంటి మహనీయుడిని ఈ సందర్భంగా స్మరించుకోవడం అందరి కర్తవ్యం.
సులువుగా అర్థమయ్యే రీతిలో బోధన
గణితశా్రస్త్రం బోధనలో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో కావాల్సిన పరికరాలతో గణితశాస్త్రం బోధిస్తే ఎప్పటికీ గుర్తుండి పోతుంది. బోధన పరికరాల తయారీపై విద్యార్థులకు శ్రద్ధ కలిగిస్తే గణితంపై పట్టు సాధించొచ్చు. పోటీ పరీక్షల్లో గణితంపై తప్పక ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. సాధారణంగా గణితాన్ని సూత్రప్రాయంగా నేర్చుకుంటే చాలా ఈజీ. ప్రణాళికాబద్దంగా చదువుకుంటే గణితం కంటే ఈజీ సబ్జెక్టు మరొకటి లేదు. గణితంలో పట్టు సాధించిన వారికి ఉన్నత ఉద్యోగాలు అందుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
బోధన పరికరాలతో గణిత పాఠాలు..
గణితం అంటే భయపడే విద్యార్థులు దాదాపు 90శాతం కనిపిస్తారు. వారిలో భయాన్ని తొలగించి పట్టు సాధించే దిశగా ప్రత్యేకంగా పరికరాలను తయారు చేసి సులభతర విధానంలో బోధిస్తున్నాం. కొన్నేండ్లుగా విద్యార్థులకు అవగాహన కల్పించడం వల్ల నేడు గణితంపై ఆసక్తిని కనబరుస్తున్నారు. - క్రాంతికుమార్, గణిత ఉపాధ్యాయుడు, పాత కొడంగల్
తాజావార్తలు
- మహమ్మారి వల్ల పెళ్లిళ్లు తగ్గాయ్
- తెలంగాణ వ్యాప్తంగా అఖండ హనుమాన్ ఛాలిసా పారాయణం
- పశ్చిమ బెంగాల్లో భారీగా నాటుబాంబులు స్వాధీనం
- సంజయ్‌లీలా భన్సాలీకి కరోనా పాజిటివ్.. క్వారంటైన్లో ఆలియాభట్
- రాహుల్ ‘బ్యాక్‌బెంచ్’ వ్యాఖ్యలపై జ్యోతిరాదిత్య సింధియా కౌంటర్!
- బ్లాక్ చెయిన్ తంటా.. పేమెంట్స్ సందేశాలకు తీవ్ర అంతరాయం
- నమ్మిన వ్యక్తులు మోసం చేశారని తెలిసి షాకయ్యా: రాజేంద్రప్రసాద్
- స్థిరంగా బంగారం.. స్వల్పంగా పెరిగిన వెండి
- త్వరలో మేడిన్ ఇండియా ఐఫోన్ 12
- పుంజుకున్న కార్లు, ట్రాక్టర్ల సేల్స్.. త్రీ వీలర్స్ 50 శాతం డౌన్!