బుధవారం 03 మార్చి 2021
Vikarabad - Dec 21, 2020 , 05:45:59

అనంతగిరిలో సండే.. ఫన్‌డే

అనంతగిరిలో సండే.. ఫన్‌డే

 వికారాబాద్‌: జిల్లా కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో అనంతగిరి కొండలు ఉన్నాయి. ఈ కొండల మధ్యన శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తు లు, పర్యాటకులు ప్రతి శని, ఆదివారం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. హైదరాబాద్‌, మహబుబ్‌నగర్‌, సంగారెడ్డి, ప్రాంతాల నుంచి పర్యాటకులు, భక్తు లు పెద్ద సంఖ్యలు వస్తున్నారు. భక్తులు ముందుగా అనంత పద్మనాభ స్వా మి దేవాలయంలో సమీపంలో ఉన్న కోనేటిలో పుణ్య స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అర్చకులు శేషగిరిపంతులు భక్తులకు అభిషే కం అందించారు. అనంతరం భక్తులు అనంతగిరిలో వ్యూ పాయింట్‌ల వద్ద అనంతగిరి అందాలను వీక్షించారు. అక్కడి నుంచి ఘాట్‌ రోడ్డులో ఉన్న నంది విగ్రహాం వద్ద పర్యాటకులు పెద్ద సంఖ్యలో సెల్పీలు దిగారు. భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అనంతగిరి అటవీలో అనందంగా గడిపారు. పర్యాటకులు వన భోజనాలు, ఆటలతో సంతోషంగా గడిపారు. 

VIDEOS

logo