ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Vikarabad - Dec 20, 2020 , 00:28:40

ఆనందమానందమాయె..

ఆనందమానందమాయె..

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకంతో పేదింటి తల్లిదండ్రులకు చేయూత

బాల్య వివాహాలకు అడ్డుకట్ట

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి

ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి

దోమ : కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో పేదింటి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూస్తున్నామని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. శనివారం దోమ మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ అనసూయతో కలిసి 53 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకంతో పేద తల్లిదండ్రులకు చేయూతన్చి వారికి అండగా మేమున్నామన్న భరోసాను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు. కొవిడ్‌ మహమ్మారి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసినా పేదల సంక్షేమ పథకాలను ప్రభుత్వం మరువలేదన్నారు. ప్రజలు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాలను గుర్తించాలని తెలిపారు. అనంతరం దోమలో నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న రైతు వేదికను ఆయన పరిశీలించారు. మండంలో ఇప్పటివరకు రైతు బీమా పథకం ద్వారా 70 మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ మల్లేశం, గ్రంథాలయ డైరెక్టర్‌ యాదయ్యగౌడ్‌, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు రాఘవేందర్‌రెడ్డి, కోఆప్షన్‌ ఖాజాపాషా, ఎంపీటీసీ అనిత, అధికారులు తహసీల్దార్‌ వాహిదా ఖాతుమ్‌, ఎంపీడీవో జయరాం, ఉప తహసీల్దార్‌ రాజేందర్‌రెడ్డి, ఆర్‌ఐలు రాజేందర్‌, లింగం, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

పేదలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కొండంత అండ

తాండూరు : పేదింటి ఆడబిడ్డల పెండ్లికి పెద్దన్నగా సీఎం కేసీఆర్‌ అందజేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కొండంత అండను అందిస్తున్నదని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దేముల్‌ మండలానికి సంబంధించిన 22 మంది లబ్ధిదారులకు చెక్కులను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో బాల్యవివాహాలు కూడా దూరమవుతున్నాయని అన్నారు. సర్కార్‌ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల మెరుగైన జీవనవిధానానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో పెద్దేముల్‌ ఎంపీపీ అనురాధ, మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దీప, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు కోహిర్‌ శ్రీనివాస్‌, గోపాల్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, రమేశ్‌, శ్రావణ్‌, రవి ఉన్నారు.  

VIDEOS

logo