సోమవారం 08 మార్చి 2021
Vikarabad - Dec 20, 2020 , 00:29:28

క్రిస్మస్‌ కానుకలు పంపిణీ

క్రిస్మస్‌ కానుకలు పంపిణీ

తాండూరు: క్రిస్టియన్‌ మైనార్టీలకు శనివారం మండలపరిషత్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి క్రిస్మస్‌ కానుకల కిట్‌లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలు కూడా పండుగలు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని మతాలవారికి పండుగ కానుకలు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 25న జరిగే క్రిస్మస్‌ పండుగను క్రైస్తవులు ఘనంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విఠల్‌నాయక్‌, వైస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, పీఎసీఎస్‌ చైర్మన్‌ రవిగౌడ్‌ ఉన్నారు. 

VIDEOS

logo