సోమవారం 01 మార్చి 2021
Vikarabad - Dec 19, 2020 , 05:29:24

ఆగిపోయిన పనులను పూర్తి చేయాలి

ఆగిపోయిన పనులను పూర్తి చేయాలి

వికారాబాద్‌: జిల్లాలో మిగిలిపోయిన ఎస్‌డబ్ల్యుఎం షెడ్లను సాలిడ్‌ వేస్టు మేనేజ్‌మెంట్‌ నిర్మాణపు పనులను త్వరితగతిన పూర్తి చేయా లని జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసు సంబంధిత అధికారులకు ఆదే శించారు. శుక్రవారం మద్గుల్‌ చిట్టంపల్లి డీపీఆర్సీ సెంటర్‌లో స్పెషల్‌ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో జిల్లాలో చేపట్టిన డంపింగ్‌ యార్డులు, ఎస్‌డబ్ల్యుఎం షెడ్లు, వైకుంఠధామాలు, కల్లాల నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం  నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, నిలిచిపోయిన డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాల పనులను వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకు రావాలని సూచించారు. 

వికారాబాద్‌, తాండూరు, కోట్‌పల్లి మండలాల్లో డంపింగ్‌యార్డు పనులు అన్ని పూర్తి అయ్యాయని కలెక్టర్‌ తెలిపారు. కొద్ది మొత్తంలో మిగిలియున్న పనులను వెంటనే పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. అలాగే వైకుంఠధామా వద్ద నర్సరీల నుంచి మొక్కలు సేకరించి నాటాలని సూచించారు. ప్రత్యేకశ్రద్ధ వహించి అధికారులు ఈ పనులను పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, డీఆర్‌డీవో కృష్ణన్‌, డీపీవో రిజ్వానా, ఈఈపీఆర్‌ శ్రీనివాస్‌రెడ్డిలతో పాటు అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు  పాల్గొన్నారు. 

VIDEOS

logo