బుధవారం 03 మార్చి 2021
Vikarabad - Dec 19, 2020 , 05:21:36

ఉపాధితోనే మహిళలఆర్థిక ప్రగతి

ఉపాధితోనే  మహిళలఆర్థిక ప్రగతి

  • అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలి
  • ప్రభుత్వ ఫలాలను అందిపుచ్చుకోవాలి
  • వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమి బసు
  • న్యూ్రట్రీ గార్డెన్‌ పథకం కింద మహిళా సంఘాలకు ఆటోలు పంపిణీ 

ఉపాధితోనే మహిళలు ఆర్థిక ప్రగతి సాధిస్తారని వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమి బసు అన్నారు. వికారాబాద్‌ మున్సిపాలిటీ మద్గుల్‌చిట్టంపల్లిలోని డీపీఆర్సీ సెంటర్‌లో శుక్రవారం డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో న్యూట్రీ గార్డెన్‌ పథకం కింద నవాబుపేట, కుల్కచర్ల, మోమిన్‌పేట మండలాల మహిళా సమాఖ్య సంఘాలకు ఆటోలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. 

వికారాబాద్‌ : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసు అన్నారు. శుక్రవారం మద్గుల్‌చిట్టంపల్లిలోని డీపీఆర్సీ సెంటర్‌లో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో న్యూట్రి గార్డెన్‌ పథకం ద్వారా నవాబుపేట, కుల్కచర్ల, మోమిన్‌పేట మండలాల మహిళ సమాఖ్య సంఘాల సభ్యులకు ఆటోలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఇచ్చిన ఆటోలతో కూరగాయల వ్యాపారం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. మహిళలు గ్రామంలో కూరగాయలను విక్రయించడం వల్ల కొంత ఉపాధి వస్తుందని తెలిపారు. మహిళలు అభివృద్ధి చెందినప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు చేరాలనే ప్రభు త్వం కృషి చేస్తుందన్నారు. మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు కూడ పెద్ద సంఖ్యలో ఇస్తున్నారని తెలిపారు. వాటిని సకాలంలో చెల్లించి మరిన్ని రుణసదుపాయాన్ని పొందాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో కృష్ణన్‌, సంబంధిత మండలాల డీపీఎంలు, ఏపీఎంలు, మహిళా సంఘాల సభ్యులు, డీఆర్‌డీఏ సిబ్బంది పాల్గొన్నారు. 

VIDEOS

logo