శనివారం 27 ఫిబ్రవరి 2021
Vikarabad - Dec 19, 2020 , 00:11:21

పశువులకు నట్టల నివారణ మందులు వేయించాలి

పశువులకు నట్టల నివారణ మందులు వేయించాలి

 పెద్దేముల్‌: రైతులు, పశువుల కా పరులు తమ వద్ద ఉన్న పశువుల కు నట్టల నివారణ మందులను తప్పకుండా వేయించాలని గోపాల్‌పూర్‌ ఇన్‌చార్జి పశువైద్యాధికారి డా.ఉష అన్నారు.శుక్రవారం మం డల పరిధిలోని తట్టేపల్లి, గొట్లపల్లి గ్రామాల్లో పెద్దేముల్‌ పశువైద్యశాఖవారి ఆధ్వర్యంలో ఆయా గ్రా మాల పశువైద్య సిబ్బందితో కలిసి ఆవులు, ఎద్దులకు నట్టల నివార ణ మందులు వేశారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారి డా.ఉష మాట్లాడుతూ నట్ట ల నివారణ మందులను గోజాతి, గేదే జాతి పశువు లలో వేయించడం వలన పశువులలో వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు, పశువులు తిన్న ఆహారాన్ని సక్రమంగా వినియోగించుకొని పాల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. కాగా శుక్రవారం తట్టేపల్లి, గొ ట్లపల్లి గ్రామాల్లో 785 ఆవులకు, ఎద్దులకు మందు లు వేసినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది చంద్రశేఖర్‌, సిద్ధిక్‌, ఆయా గ్రామాల రైతులు, పశువుల కాపరులు పాల్గొన్నారు.

VIDEOS

logo