ఆదివారం 07 మార్చి 2021
Vikarabad - Dec 19, 2020 , 00:11:21

ఘనంగా అయ్యప్పస్వామి మహాపడిపూజ

ఘనంగా అయ్యప్పస్వామి మహాపడిపూజ

 కులకచర్ల: కులకచర్ల మండల కేంద్రంలోని అయ్యప్పస్వా మి దేవాలయంలో కులకచర్ల అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో19వ మహాపడిపూజ కార్యక్ర మం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారి పూజలో పాల్గొన్నారు. ఉదయం యజ్ఞం, పూర్ణాహుతి, అభిషేకం, స్వా మివారి భజనలు, అనంతరం మహాపడి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి,వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు. పూజకు వచ్చిన భక్తులకు డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నదానం నిర్వహించారు.దేవాలయ కమిటీ చైర్మన్‌ వెంకట్‌రాంరె డ్డి, మహాబూబ్‌నగర్‌ ఈశ్వర్‌ గురుస్వామి, సతీశ్‌కుమార్‌, శివకుమార్‌, చం దు, రాములు, రాజయ్య గురుస్వాములు, అయ్యప్పస్వాముల ఆధ్వర్యంలో పడిపూజ ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామి వారికి కుంబాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో కులకచర్ల సర్పంచ్‌ సౌమ్యారెడ్డి, ఎంపీ పీ సత్యహరిశ్చంద్ర, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ నాగరాజు, టీఆర్‌ఎస్‌ మండల నా యకులు రాంరెడ్డి, సుధాకర్‌రెడ్డి, హరికృష్ణ, రాజప్ప, ఆంజనేయులు, కొండ య్య, మొగులయ్య, వెంకటయ్యగౌడ్‌, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రహ్లాద్‌రావు, అయ్యప్పస్వాములు, భక్తులు, సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు. 

VIDEOS

logo