శుక్రవారం 05 మార్చి 2021
Vikarabad - Dec 18, 2020 , 05:31:12

సంక్రాంతిలోగా భగీరథ పనులుపూర్తి చేయాలి

సంక్రాంతిలోగా భగీరథ పనులుపూర్తి చేయాలి

  • ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్‌ ఇవ్వాలి
  • ఉపాధిహామీలో పంట కాల్వలకు మరమ్మతు చేయాలి
  • రైతు వేదికలకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాలి
  • అధికారులకు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆదేశాలు

 బొంరాస్‌పేట : ‘నెలలు గడుస్తున్నా మిషన్‌ భగీరథ పనులు ఇంకా చేస్తూనే ఉన్నారు. 80 శాతం పనులు పూర్తయ్యాయి. ఇంకా 20 శాతం చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి. వచ్చే సంక్రాంతిలోగా పెండింగ్‌ పనులన్నింటినీ పూర్తి చేసి ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్‌ ఇవ్వాలని కొడంగల్‌ పట్నం నరేందర్‌రెడ్డి మిషన్‌ భగీరథ అధికారులను ఆదేశించారు. గురువారం ఎంపీపీ హేమీబాయి అధ్యక్షతన నిర్వహించిన మం డల సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. మిషన్‌ భగీరథ అంశం చర్చకు వచ్చినపుడు సర్పంచ్‌ లు, ఎంపీటీసీలు పెండింగ్‌ పనుల వల్ల మంచినీరు అంద డం లేదని ఫిర్యాదు చేశారు. చౌదర్‌పల్లిలో ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకుకు నీరందడం లేదని వైస్‌ ఎంపీపీ నారాయణరెడ్డి చెప్పారు. స్పందించిన ఎమ్మెల్యే పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని, అదనంగా సమాగ్రిని ఇప్పిస్తానని, వచ్చే సమావేశంలో మిషన్‌ భగీరథ అంశం చర్చకు రావద్దని ఆదేశించారు. నల్లా కనెక్షన్‌ వాల్వ్‌లను తీసేస్తే రెండుసార్లు నోటీ సులు ఇవ్వాలని, మూడోసారి చర్యలు తీసుకోవాలని పం చాయతీ కార్యదర్శులను ఆదేశించారు. తుంకిమెట్లలో దుకాణాలు ఉన్న ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వడం లేదని ఎంపీటీ సీ తిరుపతయ్య, కోఆప్షన్‌ సభ్యుడు జలీల్‌ చెప్పగా ప్రతి ఇం టికి నల్లా ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదేశించారు. 

మిషన్‌ భగీరథ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, సక్రమంగా పని చేయడం లేదని ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏ డాది చెరువులు కుంటలు నిండినందున ఉపాధి హామీ పథకంలో పంట కాల్వల మరమ్మతులు చేయాలని అధికారుల ను ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ఆదేశించారు. చెరువుల కింద ఆయకట్టుకు సాగునీరు సక్రమంగా అందడానికి సిబ్బందిని నియమించాలని మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి కోరగా గ్రామ పంచాయతీల నుంచి తీర్మానాలు ఇస్తే ఉన్నతాధికారులకు పంపిస్తామని నీటి పారుదలశాఖ డీఈ కిరణ్‌కుమార్‌ చెప్పారు. బాపన్‌ చెరువు, లింగన్‌పల్లి చెరువులు లీకవుతున్నాయని ఎంపీటీసీ జగదీశ్‌, సర్ప ంచ్‌ కాశప్ప తెలుపగా మరమ్మతులు చేస్తామని డీఈ చెప్పా రు. మండలంలోని అన్ని గ్రామాల్లో విద్యుత్‌ పెండింగ్‌ పనులను పూర్తి చేయాలని, రైతు వేదికలన్నింటికీ విద్యుత్‌ కనెక్ష న్‌ ఇవ్వాలని ట్రాన్స్‌కో ఏఈ రంజిత్‌కుమార్‌ను ఎమ్మెల్యే ఆ దేశించారు. పల్లె ప్రగతిలో చేసిన పనులన్నింటినీ ఎంబీ రికార్డులు చేయాలని పీఆర్‌ఏఈని ఎమ్మెల్యే ఆదేశించారు. సమావేశంలో జడ్పీటీసీ చౌహాన్‌ అరుణాదేశు, కొడంగల్‌ మార్కె ట్‌ చైర్‌పర్సన్‌ జ్యోతి, పీఏసీఎస్‌ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీడీవో హరినందనరావు, తాసిల్దార్‌ షాహెదాబేగం, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

VIDEOS

logo