మంగళవారం 09 మార్చి 2021
Vikarabad - Dec 18, 2020 , 05:28:26

రైతు సంక్షేమమే ధ్యేయం

రైతు సంక్షేమమే ధ్యేయం

బొంరాస్‌పేట : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మండలంలో మృతిచెందిన ముగ్గురు రైతులకు మంజూరైన రైతుబీమా ఆర్థికసాయం మంజూరు పత్రాలను ఎమ్మెల్యే గురువారం బొంరాస్‌పేటలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు మరణిస్తే రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందే విధంగా ఏర్పాట్లు చేసి మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటున్నదని అన్నారు. డిసెంబరు 11వ తేదీ వరకు పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చిన రైతులు రైతుబంధు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. 

కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, వైస్‌ ఎంపీపీ నారాయణరెడ్డి, జడ్పీటీసీ అరుణాదేశు, కొడంగల్‌ మార్కెట్‌ కమిటీ చైరపర్సన్‌ జ్యోతిరాథోడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల  అధ్యక్షుడు కోట్ల యాదగిరి, తాలుకా యూత్‌ అధ్యక్షుడు నరేశ్‌గౌడ్‌, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు చాంద్‌పాషా, పార్టీ నాయకులు రామకృష్ణ  పాల్గొన్నారు.


VIDEOS

logo