ఆదివారం 07 మార్చి 2021
Vikarabad - Dec 17, 2020 , 00:13:38

ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో సాగాలి

ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో సాగాలి

  • ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి 
  • పెద్దేముల్‌ మండల సర్వసభ్య సమావేశం
  • ఎస్‌ఐను సస్పెండ్‌ చేయాలని ఎంపీటీసీ, సర్పంచ్‌ల బైఠాయింపు 

పెద్దేముల్‌: ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పరం సమన్వయంతో మందుకు సాగాలని, గత సర్వసభ్య సమావేశంలోని పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని తాండూ రు ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ అనురాధ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజ రై శాఖల పరంగా సాధించిన ప్రగతి పనులను సమీక్షించా రు. సర్వసభ్య సమావేశం ప్రారంభంలో ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు గతంలో జరిగిన సర్వసభ్య సమావేశ విషయమై స్థానిక ఎస్‌ఐ మాపైన అకారణంగా కేసు నమోదు చేశారని ఎంపీటీసీ అంబరయ్య, తట్టేపల్లి పీఎసీఎస్‌ చైర్మన్‌ లక్ష్మారెడ్డి సభ దృష్టికి తీసుకురాగా, నాపై కూడా కేసులు పెట్టి వేధిస్తున్నాడని రేగొండి సర్పంచ్‌ హైదర్‌ సభలో బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే, అధికారులు, ఎంపీపీ కలుగజేసుకొని వారిని సమదాయించి ఎస్‌ఐపై చర్యలు తీసుకొనే విధంగా తీర్మానం చేస్తామని చె ప్పడంతో గొడవ సద్దు మణిగింది. అనంతరం మండలంలో ఆయా గ్రామాల్లో వివిధ శాఖల పరంగా సాధించిన వివరాలను ఆయా శాఖల అధికారులు చదివి వినిపించగా అందు కు సభ్యులు పలు సమస్యలపై అధికారులను నిలదీశారు. త్రాగునీరు, కరెంట్‌, ప్రధాన రోడ్డు పనుల ప్రారంభం, గ్రా మాల్లో నిర్మించిన పలు అభివృద్ధి పనులకు సంబంధించి చె ల్లించాల్సిన బిల్లుల విషయమై సభ్యులకు, అధికారులకు తీ వ్రస్థాయిలో చర్చ జరిగింది. శాఖల వారీగా సమీక్షల అనంతరం ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి సభ్యులను, అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ మండలంలో ఉన్న పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని, ప్రమాదకరంగా ఉన్న రోడ్లకు మ రమ్మతులు చేయాలని, మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌లను లీకేజీలను ఆరికట్టాలని, జరిగిన పనులకు త్వరగా ఎంబీలు రికా ర్డు చేసి బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. అదేవిధంగా కరోనా వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత ఒక క్రమపద్దతిలో అందరికీ వేయించాలన్నారు. ఎస్‌ఐపై వచ్చిన ఆరోపణల దృష్ట్యా తీర్మానం చేసి విచారణ చేపట్టి చర్యలు తీసుకోనే విధంగా చర్యలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అనురాధ, వైస్‌ ఎంపీపీ మధులత, టీఎల్‌డీఏ చైర్మన్‌ నారాయణ రెడ్డి, జడ్పీటీసీ ధారాసింగ్‌, ఎఫ్‌ఎస్‌సీఎస్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు విష్ణువర్ధన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మండల సర్పంచ్‌ల సం ఘం అధ్యక్షుడు బల్వంత్‌రెడ్డి, జిల్లా, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్‌చారి, ధన్‌సింగ్‌, ఎంపీడీవో లక్ష్మ ప్ప, ఎమ్మార్వో శ్రీనివాస్‌, వివిధ శాఖ అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo