మంగళవారం 09 మార్చి 2021
Vikarabad - Dec 17, 2020 , 00:13:36

పండుగలు సంతోషంగా జరుపుకోవాలి

పండుగలు సంతోషంగా జరుపుకోవాలి

  • పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి 
  • క్రిస్టియన్లకు క్రిస్మస్‌ కానుకలు పంపిణీ
  • నట్టల నివారణ మందు శిబిరం ప్రారంభం 

పరిగి : పేదలు సంతోషంగా పండుగలు జరుపుకోవాలనే ఉద్ధేశంతో తెలంగాణ ప్రభుత్వం పండుగలకు దుస్తులు పం పిణీ చేయడం జరుగుతున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పరిగిలోని మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రిస్టియన్లకు క్రిస్మస్‌ కానుకలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేదవారు తమ పండుగలను సంతోషంగా జరుపుకోవాలనే ఏకైక లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ రంజాన్‌, క్రిస్మస్‌ల సందర్భం గా ఉచితంగా దుస్తుల పంపిణీతో పాటు విందు కార్యక్రమాలకు నిధులు ఇస్తున్నదన్నారు. బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలు దేశం లో ఎక్కడా లేవని, తెలంగాణలోనే అమలు జరుగుతున్నా యన్నారు. కార్యక్రమంలో ఎంపీపీలు అరవిందరావు, మల్లే శం, అనసూయ, సత్యమ్మ, మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్యాంసుందర్‌రెడ్డి, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు హఫీజ్‌, తాసిల్దార్‌ విద్యాసాగర్‌రెడ్డి పాల్గొన్నారు. 

నప్రతి గ్రామంలో నట్టల నివారణ శిబిరాలు

  పశువులలో నట్టల నివారణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి రైతులకు సూచించారు. బుధవారం పరిగిలోని పశువుల ఏరియా దవాఖాన ఆవరణలో పశువులలో ఉచిత నట్టల నివారణ మందు వేసే శిబిరాన్ని పశుసంవర్దక శాఖ డైరక్టర్‌ లక్ష్మారెడ్డితో కలిసి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పశువులకు నట్టల నివారణ మందు వేయించాలని సూచించా రు. ప్రభుత్వం ప్రతి గ్రామంలో ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసి పశువులకు నట్టల నివారణ మందు వేస్తున్నదని తెలిపారు. నట్టల నివారణ మందు వేయించడం ద్వారా పశువులలో వ్యాధినిరోధక శక్తి పెరగడానికి దోహదం చేస్తుందని, జీవాలలో బరువు పెరిగి, పునరుత్పత్తికి సులభమవుతుందని తెలిపారు. పరిగి మండలంలోని మిట్టకోడూర్‌లో త్వరలో పశువైద్యశాల కొత్త భవనం నిర్మిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పరిగి నియోజకవర్గంలోని చిట్యాల్‌, రంగాపూర్‌, పూడూరు, కిష్టాపూర్‌లలో ఖాళీగా ఉన్న పశువైద్యుల పోస్టు లు, ఇతర సిబ్బంది, గోపాలమిత్రలను భర్తీ చేయాల్సిందిగా డైరెక్టర్‌ను ఎమ్మెల్యే కోరగా వారం రోజులలో భర్తీ చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌, ఎంపీపీ అరవిందరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వసంతకుమారి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఆంజనేయులు, సురేందర్‌కుమార్‌, పశుసంవర్దక శాఖ ఏడీఏలు ప్రహ్లాద్‌, అంకంరాజు, వైద్యాధికారులు సుజాత్‌అలీ, ఆనంద్‌, నాగప్రసాద్‌, విశ్వనాథం, రాజేశ్వర్‌, శివకుమార్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo