తూకం వేసిన వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలి

తాసిల్దార్ షాహెదాబేగం
బొంరాస్‌పేట మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తనిఖీ
బొంరాస్‌పేట : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు తెచ్చిన ధాన్యాన్ని తూకం వేసిన వెంటనే ఆ వివరాలను అదే రోజు ఆన్లైన్లో నమోదు చేయాలని తాసిల్దార్ షాహెదాబేగం కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని బొంరాస్‌పేట, బురాన్‌పూర్, మెట్లకుంట, నాగిరెడ్డిపల్లి, ఏర్పుమళ్ల గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ఏవో రాజేశ్‌కుమార్‌తో కలిసి తనిఖీ చేశారు. కేంద్రాలలోని పలు రికార్డులను వారు పరిశీలించారు. ధాన్యం తూకం ఎలా చేస్తున్నారు, ధాన్యంలో తేమ శాతాన్ని వారు పరిశీలించారు. తూకం చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తేనే రైతుల ఖాతాలలో సకాలంలో డబ్బులు జమ అవుతాయని అన్నారు.
ఆన్లైన్లో రైతు ఆధార్‌కార్డు నెంబరు నమోదు చేస్తే కొంతమంది రైతుల భూమి వివరాలు రావడం లేదన్న కారణంగా వారి ధాన్యాన్ని తూకం వేయడం లేదని కొంద రు రైతులు తాసిల్దార్‌కు ఫిర్యాదు చేయగా ఏ కారణం చేత కూడా ధాన్యం తూకం వేయడం ఆపరాదని సూచించారు. ఏర్పుమళ్లలో ఉదయం తేమ శాతం ఎక్కువగా ఉందన్న కారణంగా కొనుగోళ్లను నిలిపివేయగా తేమ శాతాన్ని పరిశీలించి కొనుగోళ్లను ప్రారంభించాలని ఆదేశించారు. సన్నరకం ధాన్యాన్ని తూకం చేయడం లేదని రైతులు ఫిర్యాదు చేయగా ఎందుకు తూకం చేయడం లేదని తాసిల్దార్ ప్రశ్నించారు. సన్న రకంలో ధాన్యం నల్లగా ఉందని మిల్లర్లు అభ్యంతరం తెలుపుతున్నారని నిర్వాహకులు తెలిపారు.
తాజావార్తలు
- కరోనా వ్యాక్సినేషన్:మినిట్‌కు 5,900 సిరంజీల తయారీ!
- పాత వెహికల్స్ స్థానే కొత్త కార్లపై 5% రాయితీ: నితిన్ గడ్కరీ
- ముత్తూట్ మృతిపై డౌట్స్.. విషప్రయోగమా/కుట్ర కోణమా?!
- శ్రీశైలం.. మయూర వాహనంపై స్వామి అమ్మవార్లు
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం
- స్విస్ ఓపెన్ 2021: మారిన్ చేతిలో సింధు ఓటమి
- తెలుగు ఇండస్ట్రీలో సుకుమార్ శిష్యుల హవా
- భైంసాలో ఇరువర్గాల ఘర్షణ.. పలువురికి గాయాలు
- గుత్తాకు అస్వస్థత.. మంత్రి, ఎమ్మెల్యేల పరామర్శ
- 2021లో రెండు సినిమాలతో వస్తున్న హీరోలు వీళ్లే