బుధవారం 24 ఫిబ్రవరి 2021
Vikarabad - Dec 16, 2020 , 00:09:50

కంపోస్టు షెడ్డులను తప్పకుండా వినియోగించాలి

కంపోస్టు షెడ్డులను తప్పకుండా వినియోగించాలి

వికారాబాద్‌ డీఎల్పీవో చంద్రశేఖర్‌  

 పెద్దేముల్‌: మండల పరిధిలోని ఆయా గ్రామ పంచాయతీ ల పరిధిలో నిర్మాణం పూర్తైన కంపోస్టు షెడ్డులను అందుబాటులోకి తెచ్చి వాటిని పూర్తిస్థాయిలో వినియోగించాలని వికారాబాద్‌ డీఎల్పీవో చంద్రశేఖర్‌ అన్నారు. మంగళవా రం మండల పరిషత్‌ కార్యాలయానికి వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పంచాయతీల పరిధిల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న కంపోస్టు షెడ్డులను వినియోగించాలని, నిర్మాణం పూర్తి కానీ కంపోస్టు షెడ్డులను త్వరగా పూర్తి చే యాలని కోరారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లో డంపింగ్‌ యార్డుల్లో చెత్తను ఎక్కడ పడితే అక్కడ తగులబెట్టరాదని అన్నారు. అన్ని గ్రామ పంచాయతీలలో 2021-2022 సంవత్సరానికి గాను చేపట్టాల్సిన బడ్జెట్‌ పనుల ప్రణాళికను కూడా వారం రోజుల్లో పూర్తి చేయాలని పూర్తి చేసిన వాటి వివరాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు“ ఈ-గ్రామ్‌ స్వరాజ్‌ పోర్టల్‌లో అప్లోడ్‌ చేయాలని పేర్కొన్నారు.

మంబాపూర్‌ సర్పంచ్‌పై విచారణ 

 మండల పరిధిలోని మంబాపూర్‌ గ్రామ సర్పంచ్‌ శ్రావణ్‌ కుమార్‌పై వచ్చిన ఫిర్యాదుపై డీఎల్పీవో చంద్రశేఖర్‌ బుధవారం గ్రామ పంచాయతీ ఆవరణలో విచారణ చేపట్టారు. నెల రోజుల క్రితం మంబాపూర్‌ గ్రామ సర్పంచ్‌ శ్రావణ్‌ కుమార్‌ గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించిన తీర్మానాలు, పలు సమావేశాలు చెప్పకుండా చేస్తున్నాడని, ఇదివరకు జరిగిన పనులపైన అనేక అనుమానాలు ఉన్నాయని డీపీవోకు ఉప సర్పంచ్‌ పద్మ వెంకట్‌ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న డీపీవో వెంటనే విచారణ చేపట్టాలని డీఎల్పీవోను ఆదేశించగా బు ధవారం డీఎల్పీవో విచారణ మొదలు పెట్టారు. విచారణలో భాగంగా బుధవారం గ్రామ పంచాయతీలో గ్రామ ఉపసర్పంచ్‌,వార్డుసభ్యులు, సర్పంచ్‌లతో డీఎల్పీవో సమావేశమై పలు అంశాలను చర్చించినట్లు సమాచారం.ఈ సందర్భం గా డీఎల్పీవో మాట్లాడుతూ సర్పంచ్‌ శ్రావణ్‌ కుమార్‌పై ఉపసర్పంచ్‌ పద్మ పలు అవినీతి, ఆరోపణలు చేశారని అందు లో భాగంగా పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని, మరోమా రు గ్రామంలో విచారణ చేపడుతామని తెలిపారు.


VIDEOS

logo