గుట్టలు స్వాహా

నందిగామ మండలంలో రాతి గుట్టలపై రాబంధుల కళ్లు
ఇతర ప్రాంతాలకు అక్రమంగా రాళ్లు సరఫరా
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
నందిగామ : మండలంలోని రాతి గుట్టలపై రాబంధుల కళ్లు పడ్డాయి. అక్రమార్కులు యదేచ్ఛగా గుట్టలను పగులగొట్టి రాళ్లను ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తు రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. ప్రభుత్వానికి సెస్సు చెల్లించకుండా అక్రమం గా వ్యాపారం కొనసాగిస్తున్నా సంబంధిత అధికారులు స్పందించడంలేదు. దీంతో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుట్ట లు కాలక్రమేణా కనుమరుగవుతున్నాయి. మండలంలోని నర్సప్పగూడ, నందిగామ, తీగాపూర్ గ్రామాల సరిహద్దుల్లో ఎతైన గుట్టలు ఎన్నో ఉన్నాయి. వ్యాపారులుగా మారిన కొందరు వ్యక్తులు వీటిని పగులగొట్టి కంకర, గ్రానైట్గా మా ర్చి ఇంతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.గ్రానైట్ ఒక్కోదాని కి రూ.15 నుంచి 25, కంకర ట్రాక్టర్ లోడ్ రూ.12వందలనుంచి 6వేలవరకు విక్రయిస్తున్నారు. నిత్యం కార్మికులను పెట్టి అక్రమ వ్యాపారులు గుట్టలను కొల్లగొడుతున్నారు. కొ త్తూరు పారిశ్రామికప్రాంతం కావడంతో మట్టి, రాళ్లకు ఎం తో డిమాండ్ ఉంది. పెద్ద పరిశ్రమలు, ఇళ్ల నిర్మాణాలకు 50 శాతం గ్రానైట్, కంకర ఇక్కడి నుంచే సరఫరా చేసేవే. లక్షల్లో వ్యాపారం కొనసాగుతున్నా 10శాతం సెస్సు చెల్లింపులో ప్రభుత్వానికి ఎగనామం పెడుతున్నారు. స్థానిక నాయకుల అండదండలతో వీరి వ్యాపారం మూడు పూవులు ఆరు కా యలుగా కొనసాగుతుంది. రాత్రి సమయాలలో పరిశ్రమలకు అక్కమ్మ చెరువులోని మట్టిని తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడం గమనార్హం. చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేస్తుంటే అధికారుల నిర్లక్ష్యంతో లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. ఇప్పటికైన సంబంధిత ఉన్నతాధికారులు కల్పించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం..
ఇప్పటివరకు మాకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. చె రువులో ఇలాంటి వ్యాపారం జరుగుతుందని మా దృష్టికి రాలేదు. క్షేత్ర సాస్థయిలో పరిశీలిస్తాం, అక్రమాలకు పాల్ప డేది ఎంతటివారైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
- ఆర్ఐవో కృష్ణయ్య, నందిగామ
అధికారుల దృష్టి పెట్టాలి
చెరువులోని మట్టి, రాళ్లతో వ్యాపా రం చేసే వ్యక్తులపై అధికారులు దృ ష్టి పెట్టకపోవడంతోనే నేటికి వారి వ్యాపారం కొనసాగిస్తున్నారు. దీం తో గతంలో ఉన్న చెరువు ప్రకృతి అందాలు కనుమరుగవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధి త అధికారులు స్పందించి అక్రమ వ్యాపారాలను అరికట్టాలి. - జంగ శ్రీనివాస్, జంగోనిగూడ