మంగళవారం 09 మార్చి 2021
Vikarabad - Dec 15, 2020 , 04:31:08

రైతులకు అండగా నిలుద్దాం

రైతులకు అండగా నిలుద్దాం

ధారూరు : అన్నదాతలకు అండగా ఉందామని జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం దారూరు మండలంలోని 13 గ్రామాల్లో రూ.75 లక్షలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు స్థానిక వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌తో కలసి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ, దేశానికి వెన్నుముకైన రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. రైతు పొలాలకు కనీసం పానాది రోడ్డు నిర్మిస్తే పంటలను సులభంగా మార్కెట్‌కు తరలిస్తారని అన్నారు. జిల్లాలో రూ.45కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. ధారూరు మండలానికి రూ.కోటి నిధులు మంజూరు చేశామన్నారు. 

రూ.75 లక్షల నిధులతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని తెలిపారు. దశల వారీగా అభివృద్ధి పనులకు నిధులుకేటాయిస్తామన్నారు. ఈ ఏడాది గ్రామాల అభివృద్ధికి బాగా పనిచేసిన కెరెల్లి, దోర్నాల, చింతకుంట, సర్పంచులకు సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైఎస్‌ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ సుజాత, జడ్పీ సీఈవో ఉష, ఎంపీడీవో అమృత, తాసిల్దార్‌ భీమయ్యగౌడ్‌, చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. 

VIDEOS

logo