బుధవారం 03 మార్చి 2021
Vikarabad - Dec 15, 2020 , 04:17:09

కొడంగల్‌లో బంజారాభవన్‌

కొడంగల్‌లో బంజారాభవన్‌

  • రూ. కోటి 20 లక్షల నిధులు కేటాయింపు
  • రెండు ఎకరాల స్థలంలో నిర్మించేందుకు సన్నాహాలు
  • పర్యాటక స్థలంగా తీర్చిదిద్దుతామన్న ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి
  • ఎమ్మెల్యే చొరవకు బంజారాల కృతజ్ఞతలు
కొడంగల్‌ : బంజారుల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఎన్నో అద్భుత పథకాలను అందించి తోడ్పాటును అందిస్తున్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం పట్టణ శివారులోని సిద్ధినాంపు ప్రదేశంలో బంజారా భవన నిర్మాణానికి రెండెకరాల స్థలం కేటాయింపునకు కృషి చేసిన ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి బంజారులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ భోగ్‌బండార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో తండాలు అభివృద్ధికి నోచుకోలేదని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే తండాల అభివృద్ధి సాధ్యపడిందని తెలిపారు. తండాలను గ్రామ పంచాయతీలుగా అవకాశం కల్పించి వారి తండాలను వారే పాలించుకునే సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేడు ప్రతి తండాకు బీటీ రోడ్డు, సీసీ రోడ్లు, ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీటి సరఫరా వంటి సౌకర్యాలు ఏర్పడి గిరిజనులు ఎంతో సంతోషంగా జీవిస్తున్నట్లు తెలిపారు. నియోజవర్గ పరిధిలో ఆయా తండాలకు బీటీ మంజూరై శంకుస్థాపన చేపట్టినట్లు తెలిపారు. 
రూ.1కోటి 20 లక్షలతో బంజార భవనం, సేవాలాల్‌ మందిర నిర్మాణం కానుందని, నిధులు సరిపోకపోతే ఆయా నిధుల నుంచి మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని ఓ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని అత్యధికంగా బంజారులు ఉన్నారని, బంజార జనాభాలో తెలంగాణలో కొడంగల్‌ 2వ స్థానంలో ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  బంజారా భవన స్థల కేటాయింపునకు కృషి చేసిన ఎమ్మెల్యేకు బంజారులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్‌ను సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్‌ మధుసూదన్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గోడల రాంరెడ్డి, పీఏసీఎస్‌ అధ్యక్షుడు కట్కం శివకుమార్‌, కొడంగల్‌, బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌ మండలాల ఎంపీపీ, సర్పంచ్‌, ఎంపీటీసీలతో సేవాలాల్‌ సేవా సంఘం అధ్యక్షుడు దేశ్యానాయక్‌తో పాటు సంఘం సభ్యులు రామునాయక్‌ టీటీ, రామునాయక్‌ పాల్గొన్నారు. అనంతరం పట్టణంలో టీ న్యూస్‌ రిపోర్టర్‌ నిజామోద్దీన్‌ కూతురు వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. 

VIDEOS

logo