గురువారం 25 ఫిబ్రవరి 2021
Vikarabad - Dec 13, 2020 , 04:53:34

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

 కులకచర్ల: ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ కథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొ ప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. శనివారం కులకచర్ల మండల కేంద్రంలో రైతు పొలంలో నిర్మించిన పశువుల షెడ్‌ను ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పలు సంక్షేమ పథకాలను రూపొందిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం రూపొందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు. ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామాల్లో రైతులకు పశువుల పాకలు, కల్లాలు మం జూరు చేస్తున్నారని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

ప్రభుత్వం రూపొందిస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయని అన్నారు. మధ్యవర్తి ప్రమేయం లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. గ్రామాల్లో ప్ర భుత్వ పథకాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవనరం ఉందని అన్నారు. రైతు సంక్షేమమే రాష్ట్ర సంక్షేమమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, ఎంపీపీ రాందాస్‌ నాయ క్‌, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు పీరంపల్లి రాజు, మండల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు సారా శ్రీనివాస్‌, గుం డుమల్ల నర్సింహులు, గ్రామ సర్పంచ్‌ సౌమ్యారెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ కులకచర్ల గ్రామ మాజీ అధ్యక్షుడు జెట్టిగాళ్ల వెంకటయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

VIDEOS

logo