ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Vikarabad - Dec 13, 2020 , 04:37:33

రాజీమార్గమే.. రాచమార్గం

రాజీమార్గమే.. రాచమార్గం

రాజీమార్గమే రాచమార్గమని, అప్పుడే కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని రంగారెడ్డిజిల్లా ప్రధాన న్యాయమూర్తి రాధారాణి అన్నారు. జిల్లా న్యాయసేనాధికారి సేవాసదనంలో శనివారం జాతీయ లోక్‌అదాలత్‌ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు.  నెలల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ విలువైన సమయం, డబ్బును వృథా చేసుకోవద్దని సూచించారు. లోక్‌ అదాలత్‌లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 3167 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. అలాగే రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో పలుచోట్ల లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. 

వికారాబాద్‌ : రాజీ కుదుర్చుకున్నాకా, మళ్లీ గొడవలు పడితే నేరుగా జైలుకు వెళ్తుతారని ప్రిన్సిపల్‌ జూనియర్‌ న్యాయమూర్తి కవిత అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో జాతీయ, రాష్ట్రస్థాయి సేవా సంస్థల ఆదేశాల మేరకు వికారాబాద్‌ న్యాయ సేవా సంస్థ పర్యవేక్షణలో జిల్లా కోర్టులో లోక్‌ అదాలత్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయముర్తి మాట్లాడుతూ, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులను కక్షిదారులు ఇద్దరు రాజీ కుదుర్చుకున్నట్లు తెలిపారు. క్రిమినల్‌ కేసులు, సివిల్‌ కేసులు, ప్రిలిగిటేషన్‌ కేసులు, భూతగాదాలు, వివాహ, కుటుంబ, రోడ్డు ప్రమాద కేసులు, చెక్‌ బౌన్స్‌ కేసులు, చిట్‌ఫండ్‌ కేసులు పరిష్కారం చేశామన్నారు. చిన్న చిన్న సమస్యలతో కోర్టుల చుట్టూ తిరిగి కాలం వృథా చేసుకోవద్దని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు క్షణికవేశాలకు లోనుకావొద్దని, మంచి ఆలోచనతో ముందుకు సాగాలన్నారు. ఎవరైనా రాజీపడేవాళ్లు ఉంటే మళ్లీ నిర్వహించే లోక్‌ అదాలత్‌లో రాజీకుదుర్చుకోవాలని సూచించారు. అందుకు తమ న్యాయవ్యవస్థ సిద్ధంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు జూనియర్‌ న్యాయమూర్తి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నారాయణ, జనరల్‌ సెక్రటరీ మమ్మద్‌ రఫీ, న్యాయవాదులు బాలయ్య, వసుందర, రాజు, ఆశం, రమేశ్‌ పాల్గొన్నారు. 

39 కేసులు పరిష్కారం :చేవెళ్ల మున్సిఫ్‌ కోర్టు న్యాయమూర్తి స్వాతి మురారి

చేవెళ్ల: కక్షిదారులు కేసులను రాజీ కుదుర్చుకునేందుకు లోక్‌ అదాలత్‌ ఎంతో ఉపయోగ పడుతుందని చేవెళ్ల మున్సిఫ్‌ కోర్టు న్యాయమూర్తి స్వాతిమురారి అన్నారు. జాతీయ న్యాయ సేవ సంస్థ ఆదేశం మేరకు శనివారం చేవెళ్ల కోర్టు ఆవరణలో లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జిదారులు, కక్షదారులు పరస్పర అవగాహనకు వచ్చి కేసులు రాజీ చేసుకుంటే లోక్‌ అదాలత్‌లో వాటిని పరిష్కరిస్తామన్నారు. చేవెళ్ల 18, శంకర్‌పల్లి 11, షాబాద్‌ 10 కేసులు  మొత్తం 39 కేసులను పరిష్కరించామన్నారు. కార్యక్రమంలో సీఐ బాలకృష్ణ, న్యాయవాదులు పాండు రంగారెడ్డి, చంద్రశేఖర్‌, యాదిరెడ్డి, మల్లేశ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

  ఇబ్రహీంపట్నంరూరల్‌ : రాజీ మార్గంతోనే కేసుల సత్వర పరిష్కారం లభిస్తుందని రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాధారాణి అన్నారు. జాతీ య న్యాయసేవా సంస్థల ఆదేశాల మేరకు శనివారం జిల్లా న్యాయ సేనాధికారి సేవా సదనంలో జాతీయ లోక్‌అదాలత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించా రు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ..క్రిమినల్‌, సివిల్‌ కేసుల ద్వారా రోజుల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ తమ విలువైన సమయా న్ని, డబ్బుని వృథా చేసుకోకుండా కక్షిదారులు రాజీ మార్గం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. కుటుంబ తగాదాలలో భార్య, బిడ్దలకు పెద్ద మనస్సుతో వారి పోషణకు భరోసా ఇవ్వాలన్నారు. ఇన్‌చార్జి మెట్రో పాలిటన్‌ సెషన్స్‌ జడ్జి ప్రేమలత మాట్లాడుతూ..రాజీ మార్గం ద్వారా పరిష్కారం అయ్యే కేసులలో అప్పీలులేని తీర్పును పొందవచ్చునని తెలిపా రు. ఎలాంటి సమస్యలున్నా పోలీసుస్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగి తమ వి లువైన సమయాన్ని వృథా చేసుకోకుండా ప్రజాకోర్టులో పరిష్కరించుకోవాలని తెలిపారు. శనివారం లోక్‌అదాలత్‌లో జిల్లా వ్యాప్తంగా 1597క్రిమిన ల్‌ కేసులు, 12సివిల్‌ కేసులు, 17మోటర్‌ వాహన ప్రమాత బీమా కేసులు, 7 బ్యాంకు రికవరీ కేసులు, 1534ప్రీ లిటిగేషన్‌ కేసులు, మొత్తం 3167కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌జడ్జి ఉదయ్‌కుమార్‌, అదనపు జిల్లా జడ్జి మారుతీదేవి, బార్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo