అక్రమ వ్యాపారాలు, కల్తీలపై నిఘా

అక్రమ వ్యాపారాలు, కల్తీలపై నిఘా పెట్టామని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. కొడంగల్ పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆయన సందర్శించి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో గతేడాది కంటే ప్రమాద మరణాలు చాలావరకు తగ్గాయన్నారు. ప్రజలు పుకార్లు నమ్మకూడదని సూచించారు. నేరాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. -కొడంగల్
కొడంగల్ : గత సంవత్సరం కంటే జిల్లా పరిధిలో ఈ సంవత్సరం దాదాపు ప్రమాద మరణాలు చాలా వరకు తగ్గినట్లు ఎస్పీ నారాయణ తెలిపారు. రెండు రోజులుగా పోలీస్‌స్టేషన్‌లో రికార్డుల పరిశీలన చేపట్టారు. శనివారం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు సంవత్సరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి సీఐ, ఎస్సైలకు సూచనలు సలహాలను చేసినట్లు చెప్పారు. లాక్డౌన్ సమయంలో రోడ్డుపై వాహనాల రద్దీ బాగా తగ్గడం, మితిమీరిన స్పీడ్‌తో హైవేపై అక్కడక్కడ ప్రమాదాలు సంభవిస్తున్నట్లు పేర్కొన్నారు. చెంగమోల్ నుంచి పరిగి, బొంరాస్‌పేట, కొడంగల్ పరిధిలో ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. వాటి నివారణకు తగు చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు. చాలా వరకు మరణాలు శాతం తగ్గిందని వివరించారు. అక్రమ, కల్తీ వ్యాపారాలపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
సోషల్‌మీడియాలో దుష్ప్రచారాలను నమ్మవద్దని, ఏవైనా అనుమానం కలిగించే ఘటనలుంటే డయల్ 100కు లేదా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో గుర్తు తెలియని వ్యక్తులు వాహనాల అద్దాలను తొలగించి దొంగతనాలకు పాల్పడటం జరిగిందన్నారు. అటువంటి వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా పరిధిలో కొత్తగా 240 మంది కానిస్టేబుళ్ల నియామకాలు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉండటంతో పాటు శాంతిభద్రతలు అదుపులో ఉన్నట్లు తెలిపారు. కొడంగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సిబ్బంది క్వార్టర్స్ శిథిలావస్థలకు చేరుకోగా, వాటిని తొలగించి నూతనంగా క్వార్టర్స్ ఏర్పాటు చేసే విధంగా ఉన్నతాధికారులకు నివేదిక అందించనట్లు తెలిపారు. పోలీస్‌స్టేషన్ రికార్డుల నిర్వాహణపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ నాగేశ్వర్రావు, ఎస్సై ప్రభాకర్‌రెడ్డితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
- బరువు తగ్గాలా.. పచ్చి బఠానీ తినండి
- ఆ నగరంలో మాంసం.. గుడ్లు నిషేధం!..
- నేను ఐటెంగాళ్ ను కాదు: అనసూయ
- ప్రైవేటు రంగంలో స్థానిక రిజర్వేషన్ల బిల్లుకు గవర్నర్ ఆమోదం
- కొవిడ్-19 సర్టిఫికెట్‌పై ప్రధాని ఫోటో ప్రచార ఎత్తుగడే : తృణమూల్ కాంగ్రెస్
- ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
- చివరి టెస్టుకు నెట్స్‌లో భారత ఆటగాళ్ల ప్రాక్టీస్
- టాప్-10 బిలియనీర్లలో జాక్‌మా మిస్?!
- వీడియో : ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన ఎమ్మెల్యే
- అంగన్ వాడీల సమస్యలన్నీ పరిష్కరిస్తాం