ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Vikarabad - Dec 13, 2020 , 04:29:37

సంక్షేమ పథకాలు అందరికీ అందేలా పార్టీ శ్రేణులు పనిచేయాలి

సంక్షేమ పథకాలు అందరికీ అందేలా పార్టీ శ్రేణులు పనిచేయాలి

కులకచర్ల:  రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు సంక్షేమ పథకాలను ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికై రెండు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ పార్టీ కులకచర్ల మండల నాయకులు, కులకచర్ల గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా చూడాలని తెలిపారు. ఈ సందర్భంగా కులకచర్లలో టీఆర్‌ఎస్‌ పార్టీ  మండల నాయకులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.

VIDEOS

logo