ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Vikarabad - Dec 12, 2020 , 05:44:58

పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

 దోమ: కరోనా కష్టకాలంలోను పల్లెల్లో అభివృద్ధి పనులను పూర్తి చేయడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దోమ మండల పరిధిలోని ఖమ్మంనాచారం గ్రామంలో శరవేగంగా పూర్తి చేసి న క్రిమిటోరియం పల్లె ప్రకృతి వనాలను ఎంపీపీ అనసూయ, సర్పంచ్‌ బండి వెంకటనర్సమ్మలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో అభివృద్ధి పనులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని కష్ట కాలంలోను పల్లెల్లో అభివృద్ధి కుంటు పడకుండా నిర్విరామ కృషి చేసి అభివృద్ధి పనులను పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామాల అభివృద్ధి, రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం క్రిమిటోరియం, పల్లె ప్రకృతి వనం, మరుగుదొడ్లు, డంపింగ్‌యార్డులతో పాటు రైతుల కోసం రైతుబంధు, రైతు బీమా, రైతు వేదికలు వంటి ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టి వాటిని అమలు చేస్తున్నదన్నారు. 

మండలంలోని 36 గ్రామ పంచాయితీలలో మొదటగా క్రిమిటోరియం, పల్లె ప్రకృతి వనం పనులను పూర్తి చేయడం అభినందనీయమని అన్నారు. ఇదే స్ఫూర్తితో అన్ని గ్రామాల సర్పంచ్‌లు కృషి చేసి పనులను పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి, అధికారులు ఎంపీడీవో జయరాం, ఏఈ మణికుమార్‌, ఎపీవో వెంకటేశ్‌, కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్‌ రమేశ్‌, గ్రామ పెద్దలు శాంతు కుమార్‌, బండి యాదయ్య, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo