గురువారం 04 మార్చి 2021
Vikarabad - Dec 11, 2020 , 04:18:01

ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం స్థల పరిశీలన

ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం స్థల పరిశీలన

వికారాబాద్‌ : జిల్లా కేంద్రంలో ఈఎస్‌ఐ దవాఖాన, టీటీడీ కల్యాణ మండపం, ఆర్టీఏ కార్యాలయం నిర్మాణం కోసం గురువారం వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ రెవెన్యూ అధికారులతో కలసి ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని రాజీవ్‌నగర్‌కాలనీ, అనంతగిరిపల్లి, బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో, మండల పరిధిలోని పులుసుమామిడి, బురాన్‌పల్లి గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రభుత్వం ద్వారా వికారాబాద్‌ నియోజకవర్గానికి టీటీడీ కల్యాణమండపం నిర్మాణం, జిల్లా రవాణ కార్యాలయం, ఈఎస్‌ఐ దవాఖాన నిర్మాణం కోసం స్థలం కోసం పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. ప్రభుత్వ స్థలాలు ఎలాంటి కబ్జాల్లో ఉన్నా వారి చెర నుంచి విడిపించుకుని నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, అక్కడ ఎంత స్థలం ఉందో అధికారులు పరిశీలించి తమకు తెలియపర్చాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వికారాబాద్‌ ఆర్డివో ఉపేందర్‌రెడ్డి, తాసిల్దార్‌ రవీందర్‌, డిప్యూటీ తాసిల్దార్‌ యాదయ్య, సర్వేయర్‌ మహేందర్‌, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. 

వికారాబాద్‌ : జిల్లా కేంద్రంలో పట్టణ సుందరీకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పట్టణ పరిధిలోని ఎన్నెపల్లి నుంచి ఆలంపల్లి మెయిన్‌ రోడ్డు పరిసరాల్లో రోడ్డు వెడల్పు పనులు చేసి డివైడర్లు ఏర్పాటుచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సంబంధిత కాంట్రాక్టర్లు  చకచకా పనులు చేస్తున్నారు. రోడ్డు మధ్యలో బట్టర్‌ పై లైటింగ్‌ విద్యుత్‌ స్థంభాల పనులు చేపట్టడం జరుగుతోంది. గురువారం వికారాబాద్‌ ైప్లె ఓవర్‌ బ్రిడ్జి వద్ద పనులు జరుగుతుండటంతో బ్రిడ్జికి రెండు వైపులా వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. దాదాపు గంట పాటు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. పోలీసులు కల్పించుకొని వాహనాదారులను సరైన దారిలో మళ్లీంచే ప్రయత్నం చేశారు. మున్సిపల్‌ అధికారులు పోలీసు అధికారుల సహకారంతో వానానదారులకు ఇబ్బంది కల్గకుండా సుందరీకరణ పనులు చేపట్టాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు. 

VIDEOS

logo