బుధవారం 24 ఫిబ్రవరి 2021
Vikarabad - Dec 10, 2020 , 05:13:35

సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి

సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి

కులకచర్ల: ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధికి కృషిచేయాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ సత్యహరిశ్చంద్ర అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల  అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తున్నదని అన్నారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. తాగునీరు, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తే మంచి గుర్తింపు లభిస్తుందని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు తమవంతు కృషిచేయాలన్నారు. చలికాలంలో కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాందాస్‌నాయక్‌, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు పీరంపల్లి రాజు, వైస్‌ ఎంపీపీ రాజశేఖర్‌గౌడ్‌, ఎంపీడీవో కాలూసింగ్‌, ఏపీవో మల్లికార్జున్‌, ఏపీఎం శోభ, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 


VIDEOS

logo