మంగళవారం 09 మార్చి 2021
Vikarabad - Dec 09, 2020 , 06:11:06

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేదలకు వరం

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేదలకు వరం

తాండూరు: సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేదలకు వరమని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరులో అనారోగ్యంతో బాధ పడుతున్న ముగ్గురికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న కుటుంబాలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఆపన్నహస్తంలా ఉపయోగపడుతుందన్నారు. ప్రజలకు సర్కార్‌ మురుగైన సేవలు అందిస్తుందన్నారు. ప్రజల మేలు కోసం సర్కార్‌ ప్రవేశ పెట్టిన పథకాలు అర్హులందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ దీప, టీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు.

VIDEOS

logo