కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ జనం

- షాద్‌నగర్, చేవెళ్లలో పలు చోట్ల ఆందోళనలు
- పాల్గొన్న టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాల పార్టీల నాయకులు
- నినాదాలతో దద్దరిల్లిన పలు వీధులు, రహదారులు
షాద్‌నగర్: కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వ పనితీరుపై రైతాంగం కన్నెర చేసింది. రైతులకు అన్యాయం చేసే చట్టాలను ఎట్టిపరిస్థితుల్లో స్వాగతించేది లేదని తేల్చి చెప్పా రు. బీజేపీ సర్కారు రైతుల నోట్లో మట్టి కొట్టి కార్పొరేట్ సంస్థల ఖజానా నింపేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. మంగళవారం దేశ వ్యాప్తంగా తలపెట్టిన భారత్‌బంద్‌లో అన్ని వర్గాల రైతులు, పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, సామన్య ప్రజలు పాల్గొని నిరసన తెలిపారు. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. షాపులు మూత పడ్డాయి. పరి శ్రమలు తమ ఉత్పత్తులను నిలిపివేశాయి. షాద్‌నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ఆధ్వ ర్యంలో ఫరూఖ్‌నగర్ మండలం బూర్గుల చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై నిర్వహించిన ఆందోళనలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారాక రామారావు, ఎంపీ కె. కేశవరావు, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సి. ప్రతాప్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్య క్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, అన్ని మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, గ్రామాల రైతులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని నిరసనలు తెలిపారు. అలాగే షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్ వద్ద కాంగ్రెస్ సీని యర్ నాయకుడు వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మాట్లాడా రు. రైతు వ్యతిరేక విధానాలను అమలుచేసిన ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదని, రాబోయే రోజుల్లో బీజేపీకి తగిన విధంగా ప్రజలు గుణపాఠం చెబుతా రన్నారు.
ముంబై-బెంగళూరు రహదారిపై రాస్తారోకో
షాబాద్: కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను వీడనాడాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. షాబాద్ మండల కేంద్రంలో జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి ముంబై-బెంగళూరు లింకు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ స్వప్నారెడ్డి, పీఏసీఎస్ చైర్మ న్ చల్లా శేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎంఏ మతీన్, శేరిగూడెం వెంకటయ్య, పొన్న నర్సింహారెడ్డి, నక్క శ్రీనివాస్‌గౌడ్, రాజేందర్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు నర్సింగ్‌రావు, జిల్లా రైతుబంధు సమితి సభ్యుడు కొలన్ ప్రభాకర్‌రెడ్డి, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు మధుసూధన్‌రెడ్డి, టీఏల్ఎఫ్ జిల్లా లీగల్ అడ్వైజర్ పీసరి సతీశ్‌రెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఏండీ చాంద్‌పాషా, మాజీ సభ్యుడు ఆయూబ్, యూత్ అధ్యక్షుడు తొంట వెంకటయ్య, డైరెక్టర్లు యాదయ్య, మల్లాపురం రాజేందర్‌రెడ్డి, నాయకులు నర్సింహులు, శ్రీశైలంగౌడ్, దర్శన్, గోపాల్, నర్సింహారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రామకృష్ణ, రమేశ్‌యాదవ్, అంజయ్య, ముక్రం, మొయిస్, ఇమ్రాన్, కుమ్మరిశ్రీను, అవిలాశ్గౌడ్, గణేశ్‌గౌడ్, చెన్నయ్య, రాజుగౌడ్ పాల్గొన్నారు. అలాగే షాబాద్ మండల కేంద్రంలోకాంగ్రెస్, సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. టీపీసీసీ కార్యదర్శి ఎలుగంటి మధుసూధన్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి పాల మాకుల జంగయ్య మాట్లాడారు. కాంగ్రెస్, సీపీఐ నాయకులు కావలి చంద్రశేఖర్, కుమ్మరి చెన్న య్య, స్వామి, వెంకట్‌రెడ్డి, జంగయ్య, నర్సింహులు, మధు, రఘరామ్ పాల్గొన్నారు.
రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలి
కొత్తూరు: రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన మూడు వ్యవసాయల చట్టాలను వెంటనే రద్దు చేయాలని టీఆర్ఎస్ మండల నాయకుడు ఎమ్మె సత్యనారాయణ డిమాండ్ చేశారు. కార్యక్ర మంలో ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రసిడెంట్ యాదగిరి, కొటిచెర్ల ఎంపీటీసీ రవీందర్‌రెడ్డి, కొడిచెర్ల తంటా సర్పంచ్ సంతోష్ నాయక్, మాజీ సర్పంచ్ జెనిగె జగన్, రైతు సమన్వయ సమతి కోఆర్డినేటర్ కృష్ణయ్య, గూడూరు సర్పంచ్ సత్తయ్య, కొత్తూరు మాజీ ఎంపీటీసీ దేవేందర్ యాదవ్, నాయకులు సుఖేందర్‌రెడ్డి, లింగయ్యనాయక్, జనార్దన్చారీ, రమేశ్, శ్రావన్, రాజు, రవీనాయక్, బాల్‌రాజు, మాధవరెడ్డి తదితరులు పాల్గొనారు.
రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేసే వరకు తమ నిరసన ఆగదని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు వీర్ల పల్లి శంకర్ అన్నారు. బంద్‌కు సంఘీభావంగా కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద చేపట్టిని నిరసన దీక్షలో వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మాండలాధ్యక్షడు సుదర్శన్నాయక్, నాయకులు కడెంపల్లి శ్రీనివాస్‌గౌడ్, మాదారం కృష్ణగౌడ్, శ్రీనివాస్, వీరమోని శ్రీను, వెంకటేశ్ ముదిరాజ్, గోపాల్, ఊట్పల్లి నర్సింహా తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి
శంకర్పల్లి రూరల్/శంకర్పల్లి: రైతన్నలు రోడ్డున పడటానికి కారణమైన బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. మండలంలోని మహా లిగపురం గ్రా మం వద్ద శంకర్‌పలి ్ల- వికారాబాద్ ప్రధాన రహదారిపై టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు రైతు లు నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని మిర్జాగూడ, జనవాడ, మోకిల, బుల్కాపురం, ఎల్వ ర్తి, దొంతాన్పల్లి గ్రామాల ప్రధాన చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.కేంద్రం తీసు కొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఎంతో నష్టం జరగుతుందని శంకర్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి అన్నారు. జిల్లా ఎమ్మెల్సీ పీ.మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యలతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బీ.వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్లు ఎం. చంద్ర మౌళి, జీ.శ్రీనాథ్‌గౌడ్, సంతోష్‌రాథోడ్, గోపాల్ పాల్గొన్నారు.
రైతుల నడ్డి విరుస్తున్నారు...
మొయినాబాద్: కేంద్ర సర్కార్ రైతుల నడ్డివిరుస్తుందని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కోంపల్లి అనంతరెడ్డి, జడ్పీటీసీ కాలశ్రీ శ్రీకాంత్ అన్నారు. మొయినాబాద్‌లో దుకాణాల సమూదాయాలు మూసివేసి బంద్ నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కె అనంతరెడ్డి, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, టీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు జే స్వప్న, ఏఎంసీ వైస్ చైర్మన్ డప్పు రాజు, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కె నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు జి జయవంత్, రావూప్, ప్రధానకార్యదర్శి నర్సింహ్మాగౌడ్,ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మోర శ్రీనివాస్, సర్పం చ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అలాగే కేంద్రం అన్నదాతల పొట్టకొడుతుందని కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు షాబాద్ దర్శన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాణెయ్య ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు.
నందిగామలో స్వచ్ఛందంగా బంద్
నందిగామ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్‌కు మద్దతుగా మంగళవారం మండల వ్యాప్తంగా వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ను పాటించాయి. మండల కేంద్రంలో బీజేపీ మినహ అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, రైతులు నిరసనలు తెలిపారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి కేటీఆర్ షాద్‌నగర్ బైపాస్ రోడ్డు పై బుర్గుల గేటు వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమానికి నందిగామ మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలి వెళ్లి మద్దతు తెలిపారు.
కేశంపేట/కొందుర్గు: షాద్‌నగర్ పట్టణానికి మంగళవారం రాష్ట్ర మంత్రి కేటీఆర్ వచ్చిన సంద ర్భంగా కేశంపేట మండల టీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్లాయి. మండలంలోని గ్రామాల నుంచి ఎంపీపీ వై.రవీందర్‌యాదవ్, టీఆర్ఎస్ పార్టీ అధ్య క్షుడు మురళీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయ కులు, కార్యకర్తలు వందలాది బైక్‌లపై ర్యాలీగా తరలి వెళ్లారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మురళీకృష్ణయాదవ్, మార్కెట్ వైస్‌చైర్మెన్ లక్ష్మీనారాయణగౌడ్, నాయకులు యాదగిరిరావు, శ్రావణ్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, వెంకన్న యాదవ్‌లతో కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మండలాల నుంచి దాదాపు వెయ్యి మంది షాద్‌నగర్ వెళ్లినట్లు టీఆర్ఎస్ జిల్లెడు చౌదరిగూడ మండల అధ్యక్షుడు హాఫీజ్ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు బాబు రావు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.
తాజావార్తలు
- ఆర్ట్ ఎగ్జిబిషన్లో సల్మాన్ పెయింటింగ్స్ ప్రదర్శన
- స్నిఫర్ డాగ్‌కు ఘనంగా వీడ్కోలు.. వీడియో
- పట్టాలెక్కనున్న మరో ఐదు ప్రత్యేక రైళ్లు
- ప్రిన్స్ సల్మాన్ ఆదేశాల ప్రకారమే జర్నలిస్టు ఖషోగ్గి హత్య
- అతివేగం, మద్యంమత్తుకు మరో ప్రాణం బలి
- ఎన్టీఆర్ మాస్క్‌పై చర్చ.. ధర తెలుసుకొని షాక్..!
- చైనా వ్యాక్సిన్‌ను పక్కన పెట్టిన శ్రీలంక
- నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
- సోదరిని ఫాలో కావొద్దన్నందుకు చితక్కొట్టారు
- నేడు ఇండియా టాయ్ ఫేర్-2021.. ప్రారంభించనున్న మోదీ