గురువారం 25 ఫిబ్రవరి 2021
Vikarabad - Dec 08, 2020 , 05:55:42

అసైన్డ్‌ భూముల అభివృద్ధికి శ్రీకారం

అసైన్డ్‌ భూముల అభివృద్ధికి శ్రీకారం

  • షెడ్యూల్డ్‌ కులాల సామాజిక, ఆర్థిక పరిస్థితుల మెరుగుకు కృషి
  • విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి వెల్లడి 
  • జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ పనితీరుపై సమీక్ష
  • పైలట్‌ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లాలో ఒక్కో నియోజక వర్గంలోని ఒక గ్రామంలో ప్రారంభం

 రంగారెడ్డి, నమస్తేతెలంగాణ:  సామాజిక తెలంగాణ సాధనే అంతిమ లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. షెడ్యుల్డు కులాల సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగు పరచడానికి రంగారెడ్డి జిల్లాలో అసైన్డ్‌ భూముల అభివృద్ధి పథకాన్ని చేపట్టనున్న ట్లు మంత్రి ప్రకటించారు. సోమవారం జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ పనితీరును తన కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..మొదటగా పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో షెడ్యు ల్డు కులాల కుటుంబాలకు ప్రభుత్వం అందజేసిన అసైన్డ్‌ భూములను అభివృద్ధి పరిచి వారి ఆర్థిక పరిస్థితులను పెం పొందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. 

ఈ పథకంలో భాగంగా అసైన్డ్‌ భూములను చదును చేయడం, బోర్లను వేయించడం, విద్యుత్‌ సౌకర్యాన్ని కల్పిం చే పనులను ప్రభుత్వం చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నా రు. ఇందుకయ్యే వ్యయాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు అసైన్డ్‌ భూములను పొందిన షెడ్యుల్డు కులాల లబ్ధిదారుల వివరాలను సేకరించి,వారి భూములను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను వెంటనే రూపొందించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పనులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్సీ శాఖ, రెవె న్యూ, విద్యుత్‌ శాఖ అధికారులతో సమన్వయంతో వ్యవహరించి సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు మంత్రి సబితారెడ్డి సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విజయానాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo