అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం

కులకచర్ల:అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం కులకచర్ల మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామంలో డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డితో కలిసి అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమి పూజ చేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్‌నాయక్, సర్పంచ్ వెంకటమ్మ, గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్, టీఆర్ఎస్ నాయకులు శేరి రాంరెడ్డి, నర్సింహులు, మొగులయ్య, మొగులయ్య, వెంకటేశ్, రాంచంద్రయ్య, బిచ్చయ్య, ఎస్సై విఠల్‌రెడ్డి పాల్గొన్నారు.
దళిత సంఘాల ఆధ్వర్యంలో..
మండల కేంద్రంలోని దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి, బీజీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు కరణం ప్రహ్లద్‌రావు, ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, దళిత సంఘాల నాయకులు వర్ధంతిని నిర్వహించారు. చౌడాపూర్‌లో ఎంపీటీసీ శంకర్, ఉపసర్పంచ్ శివకుమార్, అంబేద్కర్ సంఘం నాయకులు అంబేద్కర్‌కు నివాళులర్పించారు. ముజాహిద్పూర్, ఘనాపూర్ గ్రామంలో వర్ధంతిని నిర్వహించారు.
పరిగి పట్టణంలో..
పరిగి టౌన్ : పరిగి పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి నివాళులర్పించారు. యువజన సంఘాల ఆధ్వర్యంలో వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవింద్‌రావు, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్లు కృష్ణ, వెంకటేష్, కిరణ్, ఎంఈవో హరిశ్చందర్, ఉప సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు జంగయ్యయాదవ్, యువజన సంఘాల నాయకుడు బాబయ్య, శ్రీశైలం పాల్గొన్నారు.
ఎస్సీ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో..
తాండూరు రూరల్ : అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎస్సీ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి బెల్కటూర్ సర్పంచ్ మదన్‌కుమార్ నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘం ప్రధానకార్యదర్శి అడివప్ప, ఉపాధ్యక్షుడు శేఖర్, నర్సింహులు, నగేశ్, వెంకటేశ్, మల్లేశం పాల్గొన్నారు. అదే విధంగా మండలంలోని అంతారం గ్రామంలో సర్పంచ్ రాములు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నక్కల జీవరత్నం, ప్రకాశ్, అమ్రెశ్, కృష్ణ, ప్రశాంత్, దేవప్ప ఉన్నారు.
పూడూరు : పూడూరు మండల పరిధిలోని పూడూరు, అంగడి చిట్టంపల్లి, కండ్లపల్లి, కంకల్, పెద్ద ఉమ్మెంతాల్, చింతల్‌పల్లి, మటుగూడ గ్రామాల్లో అంబేద్కర్ వర్ధంతిని ఆయా సంఘాల ఆధ్వర్యంలో వేర్వేరుగా ఆయన విగ్రహాలకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల, సర్పంచ్‌లు నవ్వరెడ్డి, జయమ్మ, గోపాల్, వీరన్న, నర్సింహ్మరెడ్డి, మండల అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు ఎ.వెంకటయ్య, ఉప సర్పంచ్ టి.రాజేందర్, బి.రవి, విఠలయ్య చెన్నయ్యగౌడ్ ఉన్నారు.
దోమ : మండల పరిధిలోని బొంపల్లి, దిర్సంపల్లి గ్రామంలో అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. ఎంపీటీసీ నవాజ్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కొండారెడ్డి, హన్మంతు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. గుండాల గ్రామంలో అంబేద్కర్ అవార్డు గ్రహిత రామన్న మాదిగ, ఎమ్మార్పీఎస్ దోమ మండల ఇన్చార్జి శివాని వెంకటయ్య, చెన్నయ్య ముదిరాజ్, రమేశ్ నివాళులర్పించారు.
అంబేద్కర్‌కు నివాళి
తాండూరు: తాండూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహాలకు పలు పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నివాళులర్పించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్‌నాయక్, వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీప, కౌన్సిలర్ శోభారాణి పాల్గొన్నారు.
పెద్దేముల్ : మండల కేంద్రంతో పాటు బండమీదిపల్లి, జనగాం, గాజీపూర్, తట్టేపల్లి గ్రామాల్లో నాయకులు, సర్పంచులు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. పెద్దేముల్ ఎంపీటీసీ అంబరయ్య, సర్పంచ్ ద్యావరి విజయమ్మ, నాయకులు డీవై నర్సింహులు, నర్సింహులు, ఎర్రరవీందర్, మల్లప్ప, నర్సింహులు, మల్లేశ్, రామప్ప, గోపాల్, పెంటప్ప, రాము, అజీమ్, రవిశంకర్, ఎం.వెంకటయ్య, రవి, లక్ష్మణ్, అంజిలప్ప పాల్గొన్నారు.
బషీరాబాద్: మర్పల్లి గ్రామంలో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. సర్పంచ్ నీలమ్మ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.
తాజావార్తలు
- అవుషాపూర్ మహిళల విజయాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలి
- ఆర్యవైశ్యులకు ఎనలేని ప్రాధాన్యం
- ఏ ఇంటి చెత్త ..ఆ ఇంట్లోనే ఎరువు..
- కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి
- కరోనా వారియర్లు నిజమైన దేవుళ్లు
- దివ్యాంగ క్రీడాకారుల కోసం..
- నేటి నుంచి 60 ఏండ్లు పైబడిన వారికి టీకా
- అబద్ధాల బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి..
- పోలింగ్‌కు ముమ్మరంగా ఏర్పాట్లు
- వాణీదేవిలోనే పీవీని చూస్తున్నాం..