సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు

- రూ.600 కోట్లతో 2604 రైతు వేదికల నిర్మాణం
- వికారాబాద్ జిల్లాలో 97..
- అన్నదాతలందరూ సద్వినియోగం చేసుకోవాలి
- రైతుల సంక్షేమమే ధ్యేయం
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
- వికారాబాద్, మోమిన్‌పేట ధారూరు మండలాల్లో పర్యటన
- హాజరైన ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. వికారాబాద్, మోమిన్‌పేట, ధారూరు మండలాల్లో ఆదివారం వారు పర్యటించి కెరెళ్లి, నారాయణపూర్ గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలను ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రూ.600కోట్ల వ్యయంతో 2604 రైతు వేదికలు నిర్మిస్తుండగా, వికారాబాద్ జిల్లాలో రూ.22.34కోట్లతో 97 నిర్మిస్తున్నట్లు తెలిపారు. సకల సౌకర్యాలతో నిర్మిస్తున్న ఈ భవనాలు రైతులకు వరంగా మారనున్నాయన్నారు. వ్యవసాయ నిపుణులు, అధికారులు అన్నివేళలా అందుబాటులో ఉండి పంటల సాగుపై సలహాలు, సూచనలు ఇస్తారన్నారు. ఎలాంటి సమస్యలొచ్చినా అన్నదాతలందరూ ఒకచోట చేరి పరిష్కరించుకునేందుకు ఈ వేదికలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు.
వికారాబాద్, ధారూరు, మోమిన్‌పేట: తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, సీఎం కేసీఆర్ రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం నియోజకవర్గంలోని వికారాబాద్, మోమిన్‌పేట, ధారూరు మండలంలోని కెరెళ్లి, నారాయణపూర్ గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలను విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో కలిసి ప్రారంభిం చారు. అంతకుముందు మోమిన్‌పేట, నారాయణపూర్ గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కెరెళ్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా రూ. 600 కోట్లతో 2604 రైతు వేదికలు నిర్మించినట్టు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో రూ.22 కోట్ల 34 లక్షలతో 97 రైతు వేదికలు ఏర్పాటు చేశామన్నారు. వ్యవసాయ సమీక్షలు ఈ వేదికల ద్వారా చేసుకోవచ్చన్నారు. రైతులకు ఏ సమస్య వచ్చిన పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు. రైతు సంఘటితం అయితేనే బాగుపడుతారని తెలిపారు. రైతు లు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వారే ప్రకటించుకునే స్థాయికి ఎదగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. రైతు వేదికల్లో ఇంటర్నెట్, వీడియో కాన్ఫరెన్స్ హాల్ వంటి సౌకర్యలు కల్పిస్తామని తెలిపారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు వేదికల ద్వారా రైతులకు నిత్యం అందుబాటులో ఉంటారని మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతులు పండించిన ప్రతి పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని తెలిపారు. రైతులు లాక్డౌన్ చేస్తే మానవ జాతి ఊపిరి ఆగిపోతుందన్నారు. కెరెళ్లి గ్రామానికి చెందిన పెంటారెడ్డిలాంటి ఇరిగేషన్ నిపుణులు తెంలగాణకు ఉండటం గొప్పవిషయమని మంత్రి నిరంజన్‌రెడ్డి కొని యాడారు. రైతు వేదికలు దేవాలయాలు అన్నారు. రైతులు చేసిన ఏ ఉద్యమం విఫలం కాలే దని, రైతు ఉద్యమంతో మోదీ ప్రభుత్వం పతనం ప్రారంభమైందన్నారు. కేంద్రప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చి మోసం చేస్తుందన్నారు. కేంద్రానికి వ్యాపారం తప్ప వ్యవసాయం అంటే పడటం లేదన్నారు. కేంద్రం రైతులపై ఆంక్షలు పెట్టడంపై మండిపడ్డారు. ఈనెల 8న జరిగే భారత్‌బంద్‌లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా జాతీయ రహదారులు నిర్భందం చేస్తామని చెప్పారు.
విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ, రైతును రారాజుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రైతులు లేకుండా మాన వ మనుగడ సాగడం కష్టమన్నారు. రైతులు పండించిన ప్రతి పంటకు ప్రభుత్వం మద్దతు ధరను కల్పిస్తుందని తెలిపారు. దేశంలో ఏప్రభుత్వాలు ఆదరించిన విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ఆదుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, రాష్ట్ర విద్యామౌలిక సదుపాయాల కల్ప న సంస్థ చైర్మన్ నాగేందర్‌గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, ఇరిగేషన్ సలహాదారు పెంటారెడ్డి, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, వ్యవసాయ శాఖ జేడీ గోపాల్, వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, ధారూరు ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ సుజాత, మోమిన్‌పేట ఎంపీపీ వసం త, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, మున్సిపల్ మాజీ వైఎస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్‌కుమార్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, ముత్తహార్ షరీప్, పీఎసీఎస్ చైర్మన్ ముత్తంరెడ్డి, కెరెళ్లి సర్పంచ్ నర్సింహ్మారెడ్డి, నారాయణపూర్ మాజీ సర్పంచ్ సుభాన్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- రాజశేఖర్ కూతురు తమిళ మూవీ ఫస్ట్ లుక్ విడుదల
- బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్
- డేటా చోరీ గిఫ్ట్‌ల పేర బురిడీ..!
- షూటింగ్లో ప్రమాదం.. హీరోకు గాయాలు
- ఓటీపీ చెప్పండి.. కార్డు గడువు పొడిగిస్తాం..!
- రెండు రోజుల్లో.. రూ. 5లక్షలకు 4.5 కోట్లు లాభం
- రుణాల పేరుతో.. బురిడీ..
- పెండ్లి పేరుతో వల.. రూ. 10.69లక్షలు టోకరా
- బండి ఆపు.. పైసలివ్వు..!
- బండిస్తే జైలుకే..