ముస్తాబైన అన్నదాతల ఆశావేదిక

ధారూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అన్నదాతల ఆశా వేదికలు ధారూరు మండలంలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక్కో రైతు వేదికను 20 గుంటల స్థలంలో రూ.22 లక్షలు ఖర్చు చేసి నిర్మించారు. నవంబర్‌లో మండలంలోని 7 క్లస్టర్లలో రైతువేదికలను మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్‌రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రారంభించారు. మండలంలోని కెరెళ్లి గ్రామంలో నెల క్రితమే రైతు వేదిక నిర్మాణం పూర్తయ్యింది. నాగారం, గురుదోట్ల, మోమిన్‌కలాన్, మున్నూర్‌సోమారం క్లస్టర్లలో రెండు, మూడు రోజుల్లో పూర్తవుతున్నాయి. నాగసముందర్ క్లస్టర్లో పది రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఏడు క్లస్టర్లలోని రైతు వేదికలను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు పనులను వేగవంతం చేశారు. మంత్రి సబితారెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, కలెక్టర్ పౌసుమిబసు నేతృత్వంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోపాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి వ్యవసాయశాఖ, పంచాయతీరాజ్ అధికారులు రైతు వేదికల నిర్మాణంపై దృష్టి సారించారు.
రైతులకు తప్పనున్న సాగు తిప్పలు
రైతుబంధు, ఆత్మ, రైతు శిక్షణ కార్యక్రమాల కోసం రైతులను ఒకచోట చేర్చి సమావేశాలు నిర్వహించడానికి వ్యవసాయశాఖకు ఇప్పటివరకు సరైన వేదికలు అందుబాటులో లేవు. దీంతో వ్యవసాయశాఖ అధికారులు చెట్ల కింద పంచాయతీ కార్యాలయాలు, ఆలయాలు, కమ్యూనిటీ భవనాల్లో సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేది. ఈ సమస్యను అధిగమించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
రైతు వేదికతో ప్రయోజనాలు
రైతు వేదికతో రైతులకు వ్యవసాయశాఖ మరింత చేరువవుతుంది. ఈ వేదికలో వ్యవసాయ విస్తరణ అధికారికి (ఏఈవో) ప్రత్యేక గది కేటాయిస్తారు. ఒక్కో రైతు వేదికలో మూడు నుంచి నాలుగు గ్రామాలు ఉండడంతో రైతులకు వ్యవసాయశాఖ అధికారులు అందుబాటులో ఉంటారు. పంటలకు సంబంధించిన వివరాలు, శిక్షణ కార్యక్రమాలు, వ్యవసాయ పథకాలు, సూచనలు, సలహాలు తమకు చేరువలో ఉన్న రైతు వేదికకు వెళ్లి తెలుసుకోవచ్చు. ఈ వేదికలో సమావేశ మందిరం, ఏఈవో గది, మరుగుదొడ్లు, 200 మందికి సౌకర్యంగా ఉండేలా సమావేశ మందిరం నిర్మించారు. క్లస్టర్ పరిధిలోని రైతులు మట్టి నమూనాలను సేకరించి ప్రయోగాలు చేసేందుకు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది.
రైతులకు సౌకర్యవంతంగా ఉండేందుకు వేదికలు
రైతులకు సౌకర్యవంతంగా ఉం డేందుకు రైతు వేదికలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేట్టారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని రైతులకు ఇబ్బందులు కలిగించకూడదనే ఒక్కో క్లస్టరు పరిధిలో మూడు నుంచి నాలుగు గ్రామాలు ఉండేలా ఏర్పాటు చేశారు. రైతు వేదికల ద్వారా రైతుల సమస్యలు తొలిగిపోతాయి.
- రాంరెడ్డి, రైతు బంధు కమిటీ మండల అధ్యక్షుడు, ధారూరు
తాజావార్తలు
- బండి సంజయ్‌పై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఫైర్
- 5 మిలియన్ ఫాలోవర్స్ దక్కించుకున్న యష్..!
- కాంగ్రెస్‌కు 25 సీట్లు కేటాయించిన డీఎంకే
- ప్రదీప్ హీరోయిన్ క్యూట్ పిక్స్ వైరల్
- దేశంలో కొత్తగా 18,711 పాజిటివ్ కేసులు
- హుజురాబాద్ శివారులో ప్రమాదం : ఒకరు మృతి
- మహేష్ బర్త్ డే రోజు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్
- శర్వానంద్‌కు మెగాస్టార్, కేటీఆర్ సపోర్ట్..!
- తాజ్ మహల్ సాక్షిగా వివాహ వార్షికోత్సవం..
- భయపెడుతున్న భానుడి భగభగలు