సోమవారం 08 మార్చి 2021
Vikarabad - Dec 06, 2020 , 02:21:25

గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి

గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి

  • సర్పంచ్‌ విజయమ్మ 

పెద్దేముల్‌ : గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పెద్దేముల్‌ సర్పంచ్‌ ద్యావరి విజయమ్మ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్‌ అధ్యక్షతన గ్రామ సభను నిర్వహించారు. పలు సమస్యలపై గ్రామ ప్రజలు, ఆయా వార్డుల సభ్యులతో చర్చించారు. ఈ సందర్భంగా గ్రామ సభను ఉద్దేశించి సర్పంచ్‌ ద్యావరి విజయమ్మ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ సభలను నిర్వహిస్తున్నామని అన్నారు. గ్రామాభివృద్ధిలో భాగంగా వార్డుల వారీగా సమస్యలు ఉంటే ఆయా వార్డుల వార్డు సభ్యులు తన దృష్టికి తీసుకురావాలని కోరారు. మురుగుకాల్వల పరిశుభ్రత, తాగునీరు, పారిశుధ్య పనులు, వీధి దీపాల నిర్వహణ తదితర పనులను ఎప్పటికప్పుడు చేపడుతామన్నారు. గ్రామ సభలో గతంలో తీర్మానాలు చేసిన వివిధ రకాల అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని పలువురు వార్డు సభ్యులు గ్రామసభ దృష్టికి తీసుకోచ్చారు. స్పందించిన సర్పంచ్‌ విజయమ్మ త్వరలో మిగిలిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుధారాణి, వార్డు సభ్యులు, కారోబార్‌ నర్సిరెడ్డి, నాయకులు డివై నర్సింహులు, కిషన్‌రావు, రమేష్‌కుమార్‌, చాకలి రాములు, డబ్బుల నర్సింహులు, రత్నప్ప, అంగన్‌వాడీ టీచర్లు, గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

VIDEOS

logo