మంగళవారం 26 జనవరి 2021
Vikarabad - Dec 05, 2020 , 06:57:18

61 మందికి కు.ని చికిత్సలు

61 మందికి కు.ని చికిత్సలు

చేవెళ్ల: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో శుక్రవారం 61 మందికి కుటుంబ నియంత్రణ చికిత్సలు చేశారు. మొయినాబాద్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి 12మంది, షాబాద్‌ పీహెచ్‌సీ నుంచి 17మంది, శంకర్‌పల్లి పీహెచ్‌సీ నుంచి 18 మంది, ఆలూర్‌ పీహెచ్‌సీ నుంచి 14మంది మొత్తం 61మందికి చేవెళ్ల ప్రభుత్వ దవాఖానలో చికిత్సలు చేసినట్లు సర్జన్‌ హరి చంద్రారెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌వో దామోదర్‌ తెలిపారు. కు.ని చికిత్సలు ఎప్పుడు చేసే విషయాలను గ్రామాల్లో పని చేసే ఆశ వర్కర్లకు తెలియజేస్తామన్నారు. క్యాంపు ఇన్‌చార్జి అబ్ధుల్‌ అజీమ్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 


logo